NTV Telugu Site icon

Crazy Thieves: దొంగతనానికి వెళ్లారు.. గుడ్లు వండుకుని తిన్నారు.. ఆతరువాత..

Jayashankar Bhupala Palli

Jayashankar Bhupala Palli

Crazy Thieves: ఒక దొంగ దొంగతనానికి వెళ్లి ఎండవేడికి తట్టుకోలేక ఏసీ వేసుకుని పడుకున్నాడు ఈ వార్త తాజాగా షోషల్‌ మీడియాలో హల్‌ చేసిన విషయం తెలిసిందే.. ఇప్పుడు నేను చేప్పే దొంగలు క్రేజీ అనే చెప్పాలి. ఇంట్లో దొంగతనానికి వెళ్లి ఇంట్లో వున్న గుడ్లు వండుకుని తిన్నారంటే క్రేజీ కాకుండా మరేమనాలి. అంతటితో ఆగలేదండోయ్‌ గుడ్లు తిన్నాకా ఎనర్జీ వస్తుంది కదా ఇంటినంత దోచేసి పారిపోయారు. ఇంత క్రేజీ దొంగతనం ఎక్కడో కాదండి జయశకంర్‌ భూపాల పల్లి జిల్లాలో చోటుచేసుకుంది.

Read also: Road Accident: ఏపీలో రోడ్డు టెర్రర్‌.. ప్రమాదంలో ఆరుగురు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చిట్యాల మండలం ధూత్ పల్లిలో దొంగల హల్చల్ సృష్టించారు. కుందూరు అమరెందర్ రెడ్డి ఇంటికి తాళం వేసి ఉండటాన్ని దొంగలు గమనించారు. అమరెందర్ రెడ్డి ఇంట్లోకి తాళం పగల గొట్టి లోనికి చేరుకున్నారు. ఇంట్లో అంతా తిరిగారు. ఆకలి వేసిందో లేదా ఎనర్జీకోసమో కానీ అక్కడే వున్న కోడిగుడ్లను చూసి గ్యాస్‌ లో ఉడకబెట్టుకున్నారు. మంచి తీసి హ్యాపీగా తిన్నారు. ఆ తరువాత దొంగతనం చేయడం స్టార్ట్‌ చేశారు. ఇంట్లో వున్న బ్యాగులు, బీరువాలు అంతా చిందరవందరచేసి దొరికిన కాటికి దోచుకున్నారు. బీరువాలో ఉన్న తులం బంగారం,15 తులాల వెండి, వెయ్యి రూపాయల నగదు తీసుకుని పరారయ్యారు. అయితే ఆతరువాత రోజు ఇంటికి వచ్చిన అమరెందర్ రెడ్డి తాళం కిందపడివుండటం గమనించాడు. లోకి వెళ్లి చూడగా ఇళ్లంతా చిందరవందరగా పడివుంది. దీంతో ఖంగుతిన్న అమరెందర్ రెడ్డి వెంటనే పోలీసులకు ఫోన్‌ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అమరెందర్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అమరెందర్ రెడ్డి ఇంటికి తాళం వేసి వుండటాన్ని గమనించిన దొంగలు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని, అక్కడే వున్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
Punjab CM: కంగనా ఘటనపై కీలక వ్యాఖ్యలు చేసిన పంజాబ్ సీఎం

Show comments