NTV Telugu Site icon

Komaram Bheem: వీడి కక్కుర్తి తగలెయ్యా ! చనిపోయిన వ్యక్తి పింఛన్ కాజేసిన బీపీఎం..

Komaram Bheem

Komaram Bheem

Komaram Bheem: పోస్టల్‌ శాఖ బీపీఎం అవినీతిని అధికారులు బట్ట బయలు చేశారు. మూడు నెలల నుంచి అధికారుల కళ్లుగప్పి మృతి చెందిన ఓ వ్యక్తి ఆసరా పింఛన్‌ డబ్బులు కాజేసిన పోస్టల్‌ శాఖ బీపీఎం అవినీతిని బయట పెట్టారు. ఈ ఘటన వాంకిడి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కొమురం భీం జిల్లాలో వాంకిడి మండల కేంద్రానికి చెందిన షేక్ మహబూబ్ అనే వ్యక్తి ఆగస్టు నెలలో మృతి చెందాడు. అయితే తన తల్లికి పెన్షన్ మంజూరు కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసారు. అయితే షేక్ మహబూబ్ అనే వ్యక్తిపై పింఛన్‌ డ్రా చేసినట్లు అధికారులు తెలుపడంతో కుటుంబ సభ్యులు షాక్‌ అయ్యారు. షేక్ మహబూబ్ అనే వ్యక్తి పేరిట జూలై, ఆగస్టు, సెప్టెంబర్, నెలలకు సంబంధించిన మొత్తం 6048 రూపాయలు పింఛన్‌ను డ్రా చేసినట్టు మృతుడి కుటుంబ సభ్యులకు అధికారులు రికార్డులు చూపించారు. దీంతో విషయం తెలిసిన కుటుంబ సభ్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

తన తండ్రి జూలై నుంచి అనారోగ్యంతో వున్నారని ఆగస్టులో చనిపోయాడని తెలిపారు. చనిపోయిన వ్యక్తి ఎలా పింఛన్‌ తీసుకుంటాడని ప్రశ్నించారు. మృతి చెందిన వ్యక్తి పింఛన్‌ కూడా వదలరా? ఇదెక్కడి కక్కుర్తి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ బీపీఎం (BPM)పై కుటుం సభ్యులు అనుమానం వ్యక్తంచేశారు. పోస్టల్ డిపార్ట్‌మెంట్ బీపీఎం (BPM)పై వాంకిడి మండల అధికారికి మృతుని కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో వాంకిడి మండల అధికారులు బీపీఎం అక్రమాలను ఆరా తీస్తున్నారు.
Copper IUD: లైంగిక జీవితంపై కాపర్ టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలుసా?

Show comments