Site icon NTV Telugu

Shocking : పిడుగుపడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత..

Thunderstrome

Thunderstrome

Shocking : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత రాత్రి కురిసిన భారీ వర్షం, ఉరుములు, మెరుపులు భయాందోళనకు గురిచేశాయి. ఈ క్రమంలో లెంకలగడ్డ గోదావరి సమీపంలో పిడుగు పడి వందకు పైగా గొర్రెలు మృత్యువాత పడ్డాయి. పలిమెల మండలంలోని అంబట్‌పల్లి గ్రామానికి చెందిన ఐదుగురు గొర్రెల కాపరులు తమ గొర్రెల మందను మేత కోసం లెంకలగడ్డ గోదావరి తీరానికి తీసుకెళ్లారు. అక్కడ గొర్రెలను కట్టేసి కాపరులు భోజనం చేసేందుకు తమ గ్రామానికి తిరిగి వచ్చారు.

Netanyahu: ఇజ్రాయెల్ ప్రధాని సంచలన ప్రకటన.. పాలస్తీనా దేశంగా ఉండబోదని ప్రతిజ్ఞ

ఇదే సమయంలో వర్షం ఉరుములతో ముసురుకొని, పిడుగు గోదావరి తీరంలో పడింది. దాంతో గొర్రెల మందలో కల్లోలం చోటుచేసుకొని, వందకు పైగా గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మళ్లీ తిరిగి వెళ్లి చూసేసరికి తమ గొర్రెలు చనిపోయిన దృశ్యం కాపరులను తీవ్ర విషాదంలో ముంచేసింది. ఒకేసారి వందకు పైగా గొర్రెలను కోల్పోవడం తమకు తట్టుకోలేని నష్టం అని వారు వేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ముందుకు వచ్చి నష్టపరిహారం అందించాలని వారు కోరుతున్నారు.

Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. అల్ప పీడనం ఏర్పడే అవకాశం!

Exit mobile version