Car Crashed: కార్లకు డిమాండ్ పెరుగుతున్న కొద్దీ డ్రైవింగ్ నేర్చుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొందరు కంపెనీల నుంచి నేరుగా నేర్చుకుంటే, మరికొందరు డ్రైవింగ్ స్కూల్స్ నుంచి నేర్చుకుంటారు. మరి కొందరైతే అతి తెలివి ప్రదర్శిస్తూ ఇదంతా ఎందుకు మన వద్ద కారు ఉంది కదా ఆల్రెడీ వచ్చిన వారు వెంట ఉంటే మనమే నేర్చుకోవచ్చు కదా అని భావించే వారు చాలామందే ఉన్నారు. అయితే డ్రైవింగ్ ను మీ స్వంతంగా నేర్చుకొనేటప్పుడు అజాగ్రత్తగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదం ఎదుర్కొవలసి వస్తుంది. అలాంటి ఘటనే ఈరోజు జనగాంలో చోటుచేసుకుంది.
Read also: Cyberabad CP: పటాకుల దుకాణం కోసం దరఖాస్తు చేసుకోండి.. చివరి తేదీ ఎప్పుడంటే..
జనగాం పట్టణంలోని బతుకమ్మ కుంట మైదానంలో ఓ వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తితో కారు డ్రైవింగ్ చేయడం నేర్చుకుంటున్నాడు. అయితే నేర్చుకునే వ్యక్తికి తెలియని విషయం ఏంటంటే కొత్త కార్లలో పికప్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని డ్రైవింగ్ నేర్పించే వ్యక్తి.. కారు నేర్చుకుంటున్న వ్యక్తికి తెలుపకపోవడం గమనార్హం. దీంతో డ్రైవింగ్ నేర్చుకుంటున్న వ్యక్తి పికప్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. కంగారూలో బ్రేకింగ్‌కు బదులు యాక్సిలరేటర్‌ని తొక్కడంతో కారు అదుపు తప్పి ముందుకు దూసుకెళ్లింది. ఎదురుగావున్న బతుకమ్మ కుంట చెరువులోకి దూసుకెళ్లింది. చెరువులో నీరు ఎక్కువగా ఉండడంతో కారు మునిగిపోయింది. ఇద్దరు వ్యక్తులు బయటకు రావడానికి ఎంత ప్రయత్నించినా తలుపులు ఓపెన్ కాలేదు. కాగా.. స్థానికుల సూచన మేరకు డ్రైవర్ పక్కనే ఉన్న వ్యక్తి డోర్ అద్దాన్ని పగలగొట్టి నీటిలోకి దూకాడు. మరో వ్యక్తి కూడా ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పటికే అప్రమత్తమైన స్థానికులు చెరువులో దూకి ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు. మొత్తానికి ఈ ఘటనలో ఎవరికీ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటన తెలిసిన వారు కొందరు ఇది వినడానికి ఫన్నీగా అనిపించినా.. ఆ సంఘటన సమయంలో మనమే ఉంటే.. ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంటుందని మరొకొందరు కమెంట్లు చేస్తున్నారు.
Banjara Hills: పబ్‌లో అసభ్యకరమైన నృత్యాలు.. అదుపులో 100 మంది యువకులు, 42 మంది మహిళలు..