వ్యాపారం చేయాలన్నా.. వ్యవసాయం చేయాలన్నా, పిల్లల స్కూల్ ఫీజుల కోసమని ఇంట్లో డబ్బులు లేకపోయినా.. బంధువులను కానీ, తెలిసిన వాళ్లను కానీ సంప్రదించి డబ్బులు తయారు చేసుకుంటాం. డబ్బులు సరైన సమయానికి కట్టకపోతే ఒక కాగితం పెట్టుకుంటారు. చెల్లించాల్సిన సమయానికి డబ్బులు కట్టి రుణం తీర్చుకుంటారు. ఒకవేళ బ్యాంకులు లోన్ తీసుకుని కట్టకుంటే ఎక్కువ ఫైన్ పడుతుంది.
Read Also: Prudhvi Raj: 1800 కాల్స్..సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశా!
అయితే.. బ్యాంకులో తీసుకున్న లోన్ కట్టలేదని ఓ రైతు ఇంటి గేటును బ్యాంక్ అధికారులు జప్తు చేశారు. మాములుగా అయితే.. ఇంట్లో ఉండే వస్తువులు, సామాన్లు, వాహనాలను తీసుకెళ్తుంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఇంటి గేటునే తీసుకెళ్లారు. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలం ఏడునూతుల గ్రామంలో జరిగింది. బ్యాంక్ లోన్ కట్టలేదని బ్యాంకు పనులను వదిలిపెట్టుకుని మరీ.. రైతు ఇంటికి వచ్చి గేటును జప్తు చేసి తీసుకుపోయారు డీసీసీబీ బ్యాంక్ అధికారులు. అయితే.. ఆ రైతు ఎంత మొత్తంలో లోన్ తీసుకున్నాడో.. ఎంత ఈఎంఐ (EMI) కట్టాలో తెలియదు కానీ ఇంటి గేటును మాత్రం ట్రాక్టర్ తీసుకొచ్చి మరి తీసుకెళ్లారు. కాగా.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Read Also: Bhatti Vikramarka : మరోసారి కులగణన సర్వే.. ఎప్పుడంటే..?