Jana Reddy: యాదాద్రి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడం పై నేను స్పందించను అని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విభేదాలను పక్కనపెట్టి ప్రతి ఒక్కరు ప్రియాంక గాంధీ సభను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. నల్గొండలో మీడియాతో మాట్లాడుతూ.. సూర్యాపేట, యాదాద్రి, నల్గొండ జిల్లాల పార్టీ అధ్యక్షులు భారీగా జన సమీకరణ చేయాలని కోరారు. ప్రియాంక గాంధీ పర్యటన, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం జానారెడ్డి వ్యక్తిగత కార్యక్రమం కాదని అన్నారు. ప్రతి ఒక్కరు కలిసి రావాలి.. తరలిరావాలని పిలుపు నిచ్చారు. సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని పేర్కొ్న్నారు. బడుగు బలహీన వర్గాల ప్రాతినిధ్యం లేకుండా దేశంలో ఏ పార్టీ ఉండదని స్పష్టం చేశారు.
Read also: Talasani Srinivas: బల్కంపేట ఎల్లమ్మకు 2.20 కిలోల బంగారు కిరీటం
బడుగు బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా పార్టీలు, ప్రభుత్వాలు పనిచేయాలన్నారు. అలా కాదంటే పార్టీల మనగడ ఉండదని వ్యాఖ్యానించారు. యాదాద్రి జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్రలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొనకపోవడం పై నేను స్పందించను అని అన్నారు. నల్లగొండ జిల్లాకు సాగు నీరూ అందించడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లాకు సాగునీరు అందిస్తుంది అన్న నమ్మకం లేదని సంచలన వాఖ్యలు చేశారు. శ్రీశైలం టన్నెల్ పూర్తి చేయలేని అసమర్ధ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ తీవ్రంగా ఆరోపణలు చేశారు. ఆరోగ్య సమస్యలు, సమయాభావం వల్ల సీఎల్పీ నేత బట్టి విక్రమార్క పాదయాత్ర పాల్గొనలేకపోయా అని అన్నారు. కానీ.. ఏదో ఒక కార్యక్రమంలో నేను కూడా బట్టి పాదయాత్రలో పాల్గొంటానని జానారెడ్డి స్పష్టం చేశారు.
CM KCR: ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్.. ప్రారంభించిన సీఎం