NTV Telugu Site icon

గాంధీ భవన్‌లో పీఏసీ సమావేశం.. మధ్యలో వెళ్లిపోయినా జానారెడ్డి..

jana-reddy

jana-reddy

తాజాగా వెలువడిన హుజురాబాద్‌ ఉప ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌ పార్టీలో కాకరేపుతున్నాయి.. ఎన్నికల ఫలితాలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు, పార్టీని టార్గెట్‌ చేస్తూ సీనియర్లు విమర్శలు చేయడంతో.. ఇవాళ గాంధీభవన్‌లో పొలిటికల్ ఎఫైర్స్‌ కమిటీ సమావేశమైంది.. అయితే, ఈ సమావేశానికి పార్టీపై విమర్శలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి డుమ్మా కొట్టగా.. పీఏసీ సమావేశానికి హాజరైన సీనియర్ నేత జానారెడ్డి సమావేశం కొనసాగుతుండగానే.. మధ్యలోనే వెళ్లిపోయారు. ప్రతి సారి సమావేశానికి రాను.. నా అవసరం ఉన్నప్పుడే వస్తా అంటూ కామెంట్ చేసిన జానారెడ్డి.. సమావేశానికి రాలేదు అని అంటారని వచ్చినట్టు తెలిపారు.. ఇక, రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు జానారెడ్డి. అయితే, ఎన్నికల ఫలితాల తర్వాత.. పార్టీని, పీసీసీ చీఫ్‌ను టార్గెట్‌ చేసిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జగ్గారెడ్డి.. ఈ భేటీకి డుమ్మా కొట్టడంపై పార్టీ సీరియస్‌గా తసుకున్నట్టుగా తెలుస్తోంది.