NTV Telugu Site icon

Posters in Jagtial: ఒక్కొక్కరిని చంపబోతున్నాం.. జగిత్యాలలో పోస్టర్ల కలకలం..

Posters In Jagtial

Posters In Jagtial

Posters in Jagtial: మంత్రగాళ్లారా తస్మాత్‌ జాగ్రత్త అంటూ జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంటలో వాల్ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ప్రజ మంచికోరే సంస్థ పేరిట పోస్టర్లు వెలిశాయి. చ్చునూతి దగ్గరి నుంచి మొదలు పెట్టి అన్ని వాడల్లో ఉన్న మంత్రగాళ్లందరినీ చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు పోస్టర్ అతికించారు. ఎప్పుడు ఎవరు ఎలా చస్తారో మాకే తెలవదంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. రెడ్‌ పెన్నుతో ఈ విషయాన్ని అందులో రాసుకొచ్చారు. దీంతో స్థానికంగా ఈ వ్యవహారం కలకలం రేపడంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దీనిపై దర్యా్ప్తు చేస్తున్నారు. స్థానికులు భాయందోళన చెందడంతో పోలీసులు ఈ పోస్టర్లను అక్కడి నుంచి తొలగించారు. ప్రజలు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రజలు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

Read also: Group-1 Prelims: గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఈనెల 21న పరీక్షలపై..

ఇట్లు.. ప్రజల మంచి కోరే సంస్థ పోస్టర్..

గ్రామ మంత్ర గాళ్ల తస్మాత్ జాగ్రత్త… మా సంస్థకు అందిన అనేక ఫిర్యాదుల ఆధారంగా మంత్ర గాళ్లను ఒక్కొక్కరిని చంపబోతున్నం. ఆ పని గచ్చు నూతి దగ్గర ఉన్న ఇద్దరి మంత్ర గాల్ల తో మొదలు పెడతాము ఆ తరువాత గుండ్ల వాడ కట్టు, గోలొల వాడ కట్టు, గౌండ్లోల్లు, పాల కేంద్రం చుట్టూ పక్కల మరియు మాల మాదిగల వాడ కట్టులో వున్న మంత్రగాళ్లు అందరినీ చంపుతం.. ఎవరు ఎప్పుడు ఎలా చేస్తారో మాకే తెలియదు.గ్రామ ప్రజలకు మనవి ఇప్పటి వరకు మీరు చూస్తూ ఎలా వున్నారో అలాగే వుండండి అలా కాకుండా మంత్ర గాళ్ళకు సపోర్ట్ చేశారో మీకు కూడా ప్రాణపాయం వుండొచ్చు అనేక మంది అనేక బాధలు పడుతూనే వున్నారు ఈ మంత్ర గాల్లా వల్ల అంటూ వాల్ పోస్టర్ వెలిసింది. ఇది ఇలా ఉంటే.. సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం జగిత్యాల జిల్లా రాయికల్ మండలం జగన్నాథ్‌పూర్ గ్రామంలో ఓ 8 మంది మంత్రాగాళ్లను హెచ్చరిస్తూ ఫ్లెక్సీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆవార్త సంచలనంగా మారింది. ఇప్పుడు మళ్లీ మంత్రగాళ్లను హెచ్చరిస్తూ పోస్టర్లు వ్యవహారం బయటకు రావడంతో పోలీసులకు సవాల్‌ గా మారింది.

Show comments