NTV Telugu Site icon

Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి

Sangareddy Crime

Sangareddy Crime

Jagtial Crime: జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 10 రోజుల్లోనే ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా పలువురు అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగిలిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు చెందిన అనిరుధ్, మోక్షిత్ అనే ఇద్దరు విద్యార్థులు ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తోటి విద్యార్థుల సమాచారం మేరకు హాస్టల్ సిబ్బంది వారిని కోరుట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జగిత్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన అనిరుద్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. పది రోజుల వ్యవధిలో ఇద్దరి బాలురు మృతి చెందడంతో పిల్లల తల్లి దండ్రులు ఆందోళనల చెందుతున్నారు. సంఘటన స్థలాన్ని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ పరిశీలించారు. గురుకులాల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపణ చేశారు.

Read also: KTR: యాభై ఏళ్లు నీటి ఇబ్బంది రాకుండా సుంకిశాల ప్రాజెక్ట్ పూర్తి చేశాం..

అయితే పెద్దపూర్ గురుకుల పాఠశాల హాస్టల్‌లో జూలై 27న మరో ఘటన చోటుచేసుకుంది. రాత్రి నిద్రిస్తున్న ఇద్దరు విద్యార్థులను పాము కాటేయడంతో వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. వారి పక్కనే నిద్రిస్తున్న మరో బాలుడు శవమై కనిపించాడు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆ రోజు రాత్రి మెట్‌పల్లికి చెందిన హర్షవర్ధన్, ఫకీర్ కొండాపూర్ గ్రామానికి చెందిన ఆడెపు గణేష్ వసతి గృహంలో నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో వీరిని పాము కాటు వేసింది. అయితే తమను ఏదో పురుగు కుట్టిందని భావించి వాళ్లు అలాగే పడుకున్నారు. అయితే తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో సిబ్బంది వచ్చి నీళ్లు, ఆహారం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. వీరిని 6 గంటలకు మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులను పరీక్షించిన వైద్యులు పాము కాటుకు గురైనట్లు గుర్తించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిజామాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరపేట గ్రామానికి చెందిన గణాదిత్యా అనే విద్యార్థి పాముకాటుతో మృతి చెందాడు. అయితే అస్వస్థతకు గురైన తమ పిల్లలకు తక్షణ వైద్యం అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రిన్సిపాల్‌, కేర్‌ టేకర్‌పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Dog Attack: కుక్కల దాడిలో మా బాబు చనిపోయాడు.. ప్రభుత్వం చర్యలు తీసుకోదా..?

Show comments