Site icon NTV Telugu

PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యం..

Prim Minister Modi

Prim Minister Modi

PM Modi: మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమం ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. జగిత్యాలలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘మే 13న తెలంగాణ ప్రజలు కొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. తెలంగాణ ప్రజలు వికాసిత్‌ భారత్‌కు ఓటు వేయబోతున్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోంది. మల్కాజిగిరిలో ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణ ప్రజలు అబ్ కీ బార్ అంటున్నారు.. 400 పార్. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ నిన్న విడుదలైంది. గడిచిన మూడు రోజుల్లో తెలంగాణకు రెండు సార్లు వచ్చాను. దేశంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం రావడం ఖాయం. భారతదేశం అభివృద్ధి చెందితే తెలంగాణ కూడా అభివృద్ధి చెందుతుంది. బీఆర్‌ఎస్‌పై ప్రజల ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బయటపడింది. తెలంగాణను దోచుకున్న వారిని వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యం.

Read also: Wife Burns Husband: ఖమ్మంలో దారుణం.. చెవి దుద్దులు కోసం భర్తకు నిప్పంటించిన భార్య

తెలంగాణలో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ప్రారంభించాం. తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంటే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. తెలంగాణలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే అంత పవర్ నాకు వస్తుంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లు పసుపు రైతులను ఏనాడూ పట్టించుకోలేదన్నారు. బీజేపీ ప్రభుత్వం పసుపు రైతులకు ఎంతో మేలు చేసిందన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పని అయిపోతుంది. పదేళ్లపాటు తెలంగాణను బీఆర్ఎస్ దోచుకుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలతో బీఆర్‌ఎస్ ఆటలాడుతోంది. ఇప్పుడు తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మారుస్తోంది. బీఆర్‌ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఆ ఫైళ్లను పక్కన పెడుతోంది. కాళేశ్వరం అవినీతిలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కుమ్మక్కయ్యాయి. మద్యం కుంభకోణంలోనూ బీఆర్‌ఎస్‌ కమీషన్లు తీసుకుంది. బీఆర్‌ఎస్ అవినీతిపై కాంగ్రెస్ దర్యాప్తు చేయడం లేదు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ నాపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయి.

Read also: Supreme Court: ఎస్బీఐకి సుప్రీంకోర్టు చివరి గడువు.. ఎలక్టోరల్ బాండ్లపై ప్రతి రహస్యం చెప్పాల్సిందే !

కాళేశ్వరంలో బీఆర్‌ఎస్ అవినీతికి పాల్పడ్డారు. ఇక్కడ దోచుకున్న సొమ్మును కుట్రలకు వినియోగిస్తున్నారు. తెలంగాణా డబ్బు ఢిల్లీలోని కుటుంబ పార్టీ నేతలకు చేరుతోంది. దేశంలో జరుగుతున్న అన్ని మోసాలకు కుటుంబ పార్టీలే కారణమన్నారు. శివాజీ మైదాన్‌లో తన పోరాట పటిమకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ఎన్నో మాటలు అన్నారు. శక్తిని నాశనం చేసేవారికి మరియు శక్తిని పూజించే వారికి మధ్య పోరాటం జరగబోతోంది. నాకు ప్రతి స్త్రీ శక్తి రూపంగా కనిపిస్తుంది. శక్తిని నాశనం చేయాలన్న రాహుల్ గాంధీ సవాలును నేను స్వీకరిస్తున్నాను. చంద్రయాన్ విజయవంతం అయిన ప్రదేశానికి శివశక్తి అని పేరు కూడా పెట్టాను. శక్తి ఆశీస్సులు ఎవరికి ఉన్నాయో జూన్ నాలుగో తేదీన తేలిపోనుంది. నేను భారతమాతకు పూజారిని’ అని వ్యాఖ్యానించారు.
Prakash Raj : ‘420’ లే ‘400 దాటడం’ గురించి మాట్లాడుతున్నారు: ప్రకాష్ రాజ్

Exit mobile version