NTV Telugu Site icon

Jagtial: తిన్నతిండికి బిల్లు కట్టమంటే.. యజమానిపై దాడి చేసిన కస్టమర్లు..

Jagital Crime

Jagital Crime

Jagtial: తిన్న ఫుడ్ కు బిల్లు కట్టమని అడిగిన స్వీట్ హౌజ్ యజమానిపై ముగ్గురు కస్టమర్లు దాడి పాల్పడ్డారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. జగిత్యాలలో ఓ స్వీట్ హౌజ్ కి ఒక యువతి, ఇద్దరు యువకులు వచ్చారు. అయితే అక్కడ స్వీట్స్‌ ఆర్డర్‌ చేసి బగా తిన్నారు. డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతుండటంతో స్వీట్‌ హౌజ్‌ యజమానికి కస్టమర్లను డబ్బులు ఇవ్వాలని అడిగాడు. అంతే యువకుతి ఆగ్రహంతో ఎందుకు డబ్బులు ఇవ్వాలి అంటూ యజమానికి వద్దకు దుర్భాషలాడుతూ వెళ్లింది. లోపలికి ఎందుకు వస్తున్నావ్‌.. తిన్న తిండికి డబ్బులు కట్టాలా కదా? అని యజమాని ప్రశ్నించారు. దీంతో యువతితో పాటు వెనుక నుంచి వచ్చిన ఓ యువకుడు స్వీట్‌ యజమాని కాలర్ పట్టుకుని కడుపులో పిడుగుద్దులు గుద్దాడు.

Read also: Karthika Somavaaram: కార్తీక చివరి సోమవారం.. శివ నామస్మరణతో మార్మోగుతున్న శైవ క్షేత్రాలు..

తలపై కొడుతుండటంతో అటు నుంచి మరో యువకుడు వచ్చి యజమానిని తీవ్రంగా కొట్టడం మొదలు పెట్టాడు. అక్కడున్న మిగతా కష్టమర్లు దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా యువకులు ఆగలేదు. యజమానిపై దాడి చేస్తూనే వున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెంటనే స్వీట్ షాప్ యజమాని టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన నిన్న (ఆదివారం) సాయంత్రం జరిగినట్లు తెలుస్తుంది. సీసీ కెమెరాల ఆధారంగా దాడికి పాల్పడిన ముగ్గురిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. వీరు ముగ్గరు తాగి యజమానిపై దాడి చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Kaleshwaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్‌ విచారణ..

Show comments