Site icon NTV Telugu

Snake into Ganesha’s Neck: గణపతి మెడలో నాగుపాము.. పూజలు చేసిన భక్తులు

Snake

Snake

Snake into Ganesha’s Neck: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జగిత్యాల పట్టణంలో ఒక వింత చోటు చేసుకుంది. గణేష్ ఉత్సవాల్లో భాగంగా ఈరోజు (సోమవారం) పూజలు అందుకుంటున్న గణపతి మెడలోకి ఒక నాగుపాము చేరి ఆభరణంగా మారిపోయింది. పట్టణంలోని వాణి నగర్ లో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో 40 అడుగుల భారీ గణేష్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ భారీ వినాయక విగ్రహంతో పాటు చిన్న గణేశుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి సోమవారం ఉదయం భక్తులందరూ పూజిస్తుండగా ఒక నాగుపాము వచ్చి పూజలు అందుకుంటున్న గణపతి మెడకు చుట్టుకుంది.

Read Also: Prince : ప్రిన్స్ – నరేష్ అగస్త్య “కలి” రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

కాగా, శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఆ పరమ శివుడి మెడలో ఆభరణంగా ఉండే నాగుపాము ఆయన కుమారుడైన బొజ్జ గణపయ్య మెడలోకి వచ్చి చేరిందంటూ భక్తులు విశేషంగా చెప్పుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక, గణపతి మెడలో చేరిన నాగుపాము వీడియోను ఓ వినియోగదారుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు.

Exit mobile version