Monkey Fight : జగిత్యాలలో ఘోరం.. మహిళను బలితీసుకున్న కోతుల కొట్లాట.!
- భవనం పైనుంచి సిమెంట్ ఇటుక పడింది
- తలకు బలంగా తగిలి మహిళ మృతి
- ధర్మపురిలో విషాద ఘటన
- కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Monkey Fight : జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. కోతుల మధ్య జరిగిన గొడవ ఒక మహిళ ప్రాణాలను బలితీసుకుంది. భవనంపై కోతులు కొట్టుకోవడంతో పైనుంచి పడిన సిమెంట్ ఇటుక తలకు తగలడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది.
ధర్మపురి పట్టణ పరిధిలోని కమలాపూర్ ఇందిరమ్మ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే కోనపర్తి పద్మ అనే మహిళ తన ఇంటి సమీపంలోని ఒక బిల్డింగ్ కింద కూర్చుని ఉంది. ఆ సమయంలో సదరు భవనంపై కొన్ని కోతులు గుంపులుగా చేరి ఒకదానితో ఒకటి తీవ్రంగా కొట్లాడుకున్నాయి. ఈ ఘర్షణలో భవనంపై ఉన్న ఒక బరువైన సిమెంట్ ఇటుక అంచుకు జరిగి, ప్రమాదవశాత్తూ కిందకు జారిపడింది.
Also Read
- CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
- Hyderabad Metro : 25 నిమిషాల్లో ప్రాణం కాపాడిన హైదరాబాద్ మెట్రో..
- Watpally Police Station : సంగారెడ్డి జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత.. వట్పల్లి పోలీస్ స్టేషన్‌పై గ్రామస్తుల దాడి.!
- SRSP Project Update: ఎస్సారెస్పీపై ఉత్తమ్ కీలక ప్రకటన.. రైతులకు గుడ్‌న్యూస్.?
భవనం పైనుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన ఆ సిమెంట్ ఇటుక సరిగ్గా కింద కూర్చుని ఉన్న పద్మ తలపై బలంగా పడింది. ఇటుక నేరుగా తలకు తగలడంతో తీవ్ర రక్తస్రావమై ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఒక్కసారిగా జరిగిన ఈ ప్రమాదంతో ఇందిరమ్మ కాలనీలో తీవ్ర కలకలం రేగింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
తాజావార్తలు
-
Lenin : ఓటీటీలోకి అఖిల్ ‘లెనిన్’.. ఎప్పుడు ఎక్కడ చూడాలంటే!
-
Anti Paper Leak Amendment Bill: పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అమెండ్మెంట్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం..
-
CM Revanth Reddy : చెరువులకు మళ్లీ జీవం.. HYDRAAపై సీఎం ప్రశంసలు.!
-
NEET-UG 2026: నీట్- యూజీ 2026 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారు.. ఆగస్టు 4 నుంచే..
-
Nithiin : నాని ప్రొడక్షన్లో నితిన్ కొత్త సినిమా
ట్రెండింగ్
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!