Online Games : జగిత్యాల జిల్లా కేంద్రంలోని లింగంపేట గ్రామంలో ఓ హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసైన 9వ తరగతి విద్యార్థి విష్ణువర్ధన్ (15) తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే, విష్ణువర్ధన్ కొంతకాలంగా మొబైల్‌లో తరచుగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ ఉండేవాడు. ఈ అలవాటుపై అతని తల్లి పలుమార్లు మందలించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో మంగళవారం తల్లి మరల గేమ్స్ ఆడొద్దని హెచ్చరించడంతో ఆగ్రహానికి లోనైన బాలుడు ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తోంది.
Adilabad : అదిలాబాద్‌లో సంచలనం.. బెట్టింగ్ మాయలో పడి దొంగగా మారిన ఎస్బీఐ క్యాషియర్
అనంతరం తీవ్ర మనస్తాపానికి గురైన విష్ణువర్ధన్, ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో లింగంపేట ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
East Godavari District : తూర్పుగోదావరి జిల్లాలో విస్తరిస్తున్న వైరల్ ఫీవర్స్.. ప్రజల్లో ఆందోళన
