Site icon NTV Telugu

Jagga Reddy Pressmeet: నా ఆవేదన చెబుతా.. సోనియాని కలుస్తా

తెలంగాణలో హాట్ టాపిక్ మారింది కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం. పార్టీనుంచి త్వరలో బయటకు వస్తానన్నారు జగ్గారెడ్డి. ఆటోలో అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించారు. అధినేత్రి సోనియా, రాహుల్ గాంధీల అప్పాయింట్ మెంట్ ఇప్పిస్తే వాళ్ళకే నా ఆవేదన చెప్తా. ఠాగూర్..కేసీ వేణుగోపాల్ దగ్గర పరిష్కారం దొరకదన్నారు.

https://ntvtelugu.com/harish-rao-lettar-to-union-minister-nirmalasitaraman/

అప్పాయింట్ మెంట్ ఇప్పించకపోతే 15 రోజుల తర్వాత నా నిర్ణయం ప్రకటిస్తానన్నారు. గాంధీ భవన్ లో ఒకరిద్దరు పోతే పోనీ అనే కామెంట్స్ చేశారని తెలుసు. పరిష్కారం దొరుకుతుంది అని నేను ఆశించా. పార్టీ అగ్ర నాయకత్వం మీద నాకు కోపం లేదు. ఆవేదన అయినా చెప్పుకోవాలని నా ఆలోచన అన్నారు జగ్గారెడ్డి. నా సమస్యకు మందు నా దగ్గర ఉంది. పీసీసీ టీ కప్పులో తుఫాను మాటల్లో తప్పు లేదు. కానీ పంచాయతీ మూలం వెతకడం లేదు. జగ్గారెడ్డి ఎందుకు రోడ్డు ఎక్కాడు అనే దానికి టాగూర్ సమాధానం చెప్పాలి. సమస్యలన్నిటికీ టాగూర్ సమాధానం ఇవ్వాలి. 15 రోజులు వెయిట్ చేద్దాం. నా ఆవేదనకు మందు దొరికితే చూద్దాం అన్నారు.

Exit mobile version