Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Jaggareddys Sensational Comments On Revanth Reddy

Jagga Reddy: రేవంత్ దగ్గరికి వెళ్ళి ఏ మొఖం పెట్టుకుని అడగాలి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

Published Date :January 29, 2024 , 2:59 pm
By Bhanu
Jagga Reddy: రేవంత్ దగ్గరికి వెళ్ళి ఏ మొఖం పెట్టుకుని అడగాలి.. జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Jagga Reddy: ఒక వేల గెలిచి ఉంటే సీఎం రేవంత్ దగ్గరికి వెళ్ళి సంగారెడ్డిలో అభివృద్ధి కోసం నాకు ఇన్ని కోట్లు కావాలని నేరుగా అడిగేవాడిని అని.. కానీ ఇప్పుడు ఏ మొఖం పెట్టి అడుగుతాను ఆలోచన చేయండని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే నేను సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలను ఉదేశించి చెప్పిన్నట్లు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. సోషల్ మీడియా, యూట్యూబ్ చానెల్స్, ప్రింట్ & ఎలక్టనిక్ మీడియాలో రావడం జరిగిందన్నారు. ఐతే అవి నేను చెప్పిన్నట్లు చెప్పను అలాగని చెప్పలేదు అని చెప్పనన్నారు. ఎందుకంటే వార్తలు వచ్చాయి అది ఐపోయిందన్నారు. నాకు ఓటు వేసిన డెబ్భైవేల మందికి నేను జవాబు దారిగానే ఉంటానని తెలిపారు. జగ్గారెడ్డి చెప్పింది నాకు ఓటు వేయని 80 వేల మంది ఆలోచన చేయాలనీ మాత్రమే చెప్తున్నా అన్నారు. ఒకసారి మున్సిపల్ కౌన్సిలర్ గా, మున్సిపల్ చైర్మన్ గా,3 సార్లు ఎమ్మెల్యే గా గెలిపించారు, రెండు సార్లు ఓడిపోయినా అన్నారు. ఐన ఈ 70 వేల మంది నాకు ప్రతి ఎన్నికలో ఓట్లు వేస్తూనే వచ్చారని తెలిపారు. నాకు ఓట్లు వేసిన ఈ 70వేల మందికి నేను ఓడిపోయినా ఎప్పుడు జవాబు దారిగానే ఉంటా అని తెలిపారు.

ఇది నా మొదటి ప్రధాన్యత అన్నారు. రెండో ప్రాధాన్యతలో నాకు ఓటు వేయని 80వేల మందికి అండగానే ఉంటా అన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదు.. ఎవరు కన్ఫ్యూస్ అవ్వొద్దని అన్నారు. ఐతే నేను చెప్తున్నే వచ్చా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది ఆలోచన చేసి ఓటు వేయండని అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయిన్నప్పటికి ఎక్కడో చిన్న తేడా వచ్చింది.. 80 వేల మంది ఎందుకు ఆలోచన చేయలేదో మరి ఓటు వేసేటప్పుడు అన్నారు. ఐనా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది సంతోషమన్నారు. జగ్గారెడ్డి మనస్తత్వం ఏంటో సంగారెడ్డి ప్రజలకు తెలుసని, ఐన ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది అంతే అన్నారు. నేను ఓడిపోయినా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి ప్రజల ఆలోచన ఎలా ఉందొ నాకు తెలుసు కాబట్టి అలాగే పని చేయిస్తా అన్నారు. జగ్గారెడ్డి ఏది ఓట్ల కోసం చేయడు మీకు తెలుసన్నారు. ఎవరు ఆపదలో ఉన్న అందుబాటులోకి వస్తా.. నాకు చేతనైనకాడికి సహాయం చేశాను.. చేస్తానని హామీ ఇచ్చారు. ఓట్ల కోసం చేయను కదా ఇదంతా.. అంటూ క్లారిటీ ఇచ్చారు. ఓట్ల కోసం చేస్తే ఎందుకు ఇన్ని పండుగలు కోట్ల రూపాయలు సంవత్సరానికి ఖర్చు చేసి చేస్తానని అన్నారు.

దసరా, బోనాలు, శ్రీరామనవి, శివరాత్రి, వినాయకచవతి పండుగలు సంవత్సరానికి 8 నుండి 10 కోట్లు అవుతాయి కదా అన్నారు. అలాగే రంజాన్ ఉపవాసదినాలో ఇఫ్తార్ పండుగ విందు ఇచ్చి సంతృతి చెందుతా అని తెలిపారు. అలాగే క్రిస్మస్ పండుగకు కేక్ లు పంపించి సంతృప్తి చెందుతా అన్నారు. ఓట్ల కోసమే చేయాలి అనుకుంటే పైసలు పెట్టుకొని ఎన్నికల సమయంలో పంచితే సరిపోతుంది కదా అన్నారు. అలాగే బీరప్ప, మల్లన్న, భవాని మత, ఎల్లమ్మ, మొహరం పీర్ల పండుగలు ఇలా జాతరాలకు కాలి చేతులతో రాను కదా..ఇవ్వని ప్రజలు సంతోషంగా ఉంటారని, నాకు పండుగలు చేయడం ఇష్టం కాబట్టి చేస్తున్నానని తెలిపారు. మీకు తెలుసు నేను పదేళ్లు అధికారంలో ఉన్నపుడు ఎలాంటి అభివృద్ధి పనులు సంగారెడ్డి నియోజకవర్గంలో చేశానో.. ఇంటింటికి మంజీరా నీళ్లు తెచ్చానని అన్నారు. ఒక ఐఐటీ, కలెక్టర్ ఆఫీస్, రాజీవ్ పార్క్, నేషనల్ రోడ్స్, లైటింగ్స్ ఇంకెన్నో అన్నారు. మెడికల్ కాలేజీ కోసం 2014 లో నేను ఓడిపోయాక పోరాటం చేశానని అన్నారు. 2018 గెలిచాక సభలో అడిగి సాధించానని అన్నారు. ఇలా సంగారెడ్డి లో నేనేం చేశానో నాకంటే ఎక్కువ మీకే తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదన్నారు.

Read also: Komatireddy: కాలిగోటికి సరిపోని వాడే మిమ్మల్ని ఫామ్ హౌస్ లో పండబెట్టాడు.. కేటీఆర్ కు కోమటిరెడ్డి సెటైర్

మరి బీఆర్ఎస్ 9 ఏళ్లలో ఎం చేసిందన్నారు. ఇలా మేము ఇది చేశామని వాళ్ళు ఎం చెప్తారు… ఏమైనా చేస్తే కదా చెప్పేదన్నారు. ఇదంతా దృష్టిలో పెట్టుకొనే నేను కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందన్నారు. సంగారెడ్డి నీ మరింత అభివృద్ధి చేస్తా గెలిపించుకోండి అలోచించి ఓటు వేయాలని కోరానని అన్నారు. కానీ 80 వేల మంది ఎందుకు సరిగా ఆలోచన చేలేదో ఒక్కసారి ఇప్పుడైనా ఆలోచన చేసుకోండని తెలిపారు. ఒక వేల గెలిచి ఉంటే సిఎం రేవంత్ దగ్గరికి వెళ్ళి సంగారెడ్డి లో అభివృద్ధి కోసం నాకు ఇన్ని కోట్లు కావాలని నేరుగా అడిగేవాడిని అన్నారు. కానీ ఇప్పుడు ఏ మొఖం పెట్టి అడుగుతాను ఆలోచన చేయండని అన్నారు. ఐన సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ప్రజల మనసులో ఉన్న పనులు చేస్తాను. ఐతే కొన్ని రోజులు మాత్రం కొంత దూరంగా ఉంటాను. నేను చేసే పనులు ఏవి ఆగవన్నారు. పండుగలు సైతం యధావిధిగా ప్రతి సంవత్సరం లాగే చేస్తానన్నారు. త్వరలో కార్యకర్తలతో కూడా సమావేశం ఏర్పాటు చేస్తాను.అందరిని కలుస్తానని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన 6 గ్యారెంటీ స్కీమ్ లు అందరు దరఖాస్తు చేసుకోండన్నారు. ఎవరైనా మిస్ ఐతే కూడా సంగారెడ్ట్ రాంనగర్ లోని నా ఆఫీస్ కు వెళ్ళి దరఖాస్తులు ఇవ్వండన్నారు. నా భార్య నిర్మల నే నియోజకవర్గం లో అన్ని చూసుకుంటుందన్నారు. ఇంతకు ముందు కూడా నిర్మలనే చూసుకునేది ఇప్పుడు కూడా ఫుల్ టైమ్ ఇస్తుందన్నారు. అలాగే పార్టీ బ్లాక్ ప్రెసిడెంట్ లు, మండల ప్రెసిడెంట్ లుటౌన్ ప్రెసిడెంట్ లు, ,nsui, యూత్ కాంగ్రెస్, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతు,మహిళా కాంగ్రెస్ కాంగ్రెస్ అనుబంధసంఘాల నాయకులు అలాగే నియోజకవర్గం లో గెలిచినా, ఓడినా ప్రజాప్రతినిధులు ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటారన్నారు. నాకు ఎల్లపుడు ఓటు వేస్తున్న 70 వేల మందికి,నాకు ఓటు వేయని 80 వేల మంది నేను తోడుగానే ఉంటా అన్నారు. నాకు నా సంగారెడ్డి నియోజకవర్గ మూడు లక్షల మంది ఓటు వేసిన వేయకపోయినా నా ఆత్మబంధువులే అన్నారు. నాకు ఎవరిపై ఎలాంటి కోపం ఉండదు.. జగ్గారెడ్డి వ్యక్తిత్వం, మనస్తత్వం అందరికి తెలిసిందే అన్నారు. కష్టాలో ఉంటే ఆదుకోవడమే తప్ప ఇంకోటి తెలియదన్నారు. ఓటమి ఎలాగో జరిగిపోయింది. కేవలం 80 వేల మంది ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయలేదు ఇప్పుడైనా చేయాలనీ చెప్తున్నావన్నారు.
Rose Gold Beauty Parlour: పార్లర్ పేరుతో మోసం.. రూ.3 కోట్లతో దంపతులు పరార్..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • CM Revanth Reddy
  • CM Revanth Vs Jaggareddy
  • Jaggareddy comments
  • Jaggareddy sensational comments
  • revanth reddy

తాజావార్తలు

  • OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్‌పర్సన్ అసంతృప్తి రాగం..!

  • OTR: జీవన్ రెడ్డి రాకను వ్యతిరేకించిన నేతలు ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు?

  • Off The Record: ఈటల రాజేందర్ కమలంలో కంఫర్ట్ గానే ఉన్నారా?

  • Opinion Poll 2026: నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో గెలిచేది వీరేనా? ఒపీనియన్ పోల్స్‌లో ఆసక్తికర ఫలితాలు..

  • OTR: ముగ్గురు అధ్యక్షులు, ముచ్చటగా మూడు జిల్లాలు.. కానీ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ఎక్కడ?

ట్రెండింగ్‌

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions