NTV Telugu Site icon

Jagga Reddy: ఇందిరమ్మకు ఉన్న చరిత్ర.. మోడీ, అమిత్‌ షాలకు ఉందా?

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: ఇందిరమ్మకు ఉన్న చరిత్ర మోడీ, అమిత్‌ షాలకు ఉందా? అని మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసింది అని మాట్లాడుతున్నాయి.. సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడు.. కేసీఆర్ కుటుంబం అంతా సెట్ అయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబానికి కాంగ్రెస్ ఏం చేసింది అనేది ఊత పదం అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా..? అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ స్వాతంత్య్ర ఉద్యమంలో ఆరేళ్ళ జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు.

Read also: Vinod Kumar: మేడిగడ్డ కుంగడంలో ఎవరిది తప్పని ఇప్పటికి తేల్చలేదు..

బీజేపీ నేతలకు ఈ చరిత్ర ఉందా..? మోడీ..అమిత్ షాలకు ఉందా ఇందిరమ్మకు ఉన్న చరిత్ర అని ప్రశ్నించారు. అమిత్ షా.. జైలుకు ఎందుకు వెళ్ళాడో అందరికి తెలుసన్నారు. కేసీఆర్ జైల్లో ఒక్క రోజు కూడా ఉండలేకపోయారు. ఒక్కరోజుకే కాళ్ళు చేతులు కొట్టుకున్నారని అన్నారు. దళితులకు,గిరిజనులకు భూములు పంచిన చరిత్ర ఇందిరమ్మదన్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇచ్చిన భూముల పైనే ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. మోడీ కానీ, కేసీఆర్ కానీ ఒక్క ఇంచు భూమి అయినా ఇచ్చారా..? అని ప్రశ్నించారు. బ్యాంకులను జాతీయం చేశారు ఇందిరమ్మ.. ప్రతీ ఊర్లో బ్యాంకులు ఉన్నాయంటే ఇందిరమ్మె కారణం కాదా? రోటీ.. కపడా.. మకాన్.. నినాదంతో ప్రతీ పేద ఇంటికి ఇందిరమ్మ పేరు వెళ్ళిందన్నారు.

Read also: Summer Holidays: విద్యార్థులకు పండగే…. రేపటి నుంచి వేసవి సెలవులు..

బీహెచ్ఈఎల్, ఐడిపీఎల్, హెచ్ఏఎల్, హెచ్ఎంటీ, బీడీఎల్, హెచ్ సీఎల్, సీఎస్ఐఆర్, ఈసీఐఎల్, డీఆర్డీఎల్, లాంటి సంస్థలు పెట్టింది ఇందిరమ్మ అన్నారు. ఇప్పుడున్న యువత చరిత్ర తెలుకోవాలన్నారు. భజరంగ్ దళ్ పాటకు దుంకుడు కాదు.. ఇందిరమ్మ పరిశ్రమలు పెడితే.. మోడీ మూసేస్తున్నాడని మండిపడ్డారు. పేదలు బతకాలని సంజీవిని లాంటి పరిశ్రమలు ఇందిరమ్మ పెడితే.. మోడీ అమ్మకానికి పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నిటినీ ప్రయివేట్ పరం చేస్తున్నాడని మండిపడ్డారు. విశాఖ స్టిల్ ఫ్యాక్టరీ అమ్మేశారని, జనం ది కూడా తప్పే.. ఇవన్నీ ప్రశ్నించక పోవడం జనం తప్పే అన్నారు. పాకిస్థాన్ తో ఇందిరమ్మ యుద్ధం చేసి గెలిచారని గుర్తుచేశారు. పుల్వామా లో దాడి చేస్తే మోడీ నిద్రలో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాజ్ పాయ్.. ఇందిరమ్మను అపర కాళీ అన్నాడని, నిబద్ధత కలిగిన నాయకుడు వాజ్ పాయ్ అన్నారు.
TS Inter Results 2024: రేపు ఉదయం 11 గంటలకు ఇంటర్ ఫలితాలు..