Site icon NTV Telugu

Breaking: రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకున్న జగ్గారెడ్డి

Jagga Reddy

Jagga Reddy

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి లేఖ రాసిన టి.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ.. ఈ లేఖ రాసిన క్షణం నుంచి తాను కాంగ్రెస్‌ గుంపులో లేనట్లేనని పేర్కొన్న విషయం తెలిసిందే.. సడెన్‌గా వచ్చి లాబీయింగ్ చేస్తే ఎవరైనా పీసీసీ కావొచ్చని లేఖలో పేర్కొన్న ఆయన.. తనపై కోవర్ట్ అనే నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలోనూ కాంగ్రెస్‌లో వర్గ పోరు వుండేదని గుర్తుచేసిన ఆయన.. త్వరలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేస్తానంటూ లేఖలో పేర్కొన్న విషయం తెలిసిందే.. అయితే, ఇవాళ రాహుల్‌ గాంధీతో జరిగిన సమావేశానికి హాజరైన జగ్గారెడ్డి.. కీలక నిర్ణయం తీసుకున్నారు.. రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

Read Also: Congress: రాహుల్‌తో తెలంగాణ నేతల కీలక భేటీ.. మధ్యలోనే బయటకు కోమటిరెడ్డి..

మొత్తంగా ఫిబ్రవరిలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాసిన జగ్గారెడ్డి.. ఇవాళ రాహుల్‌ గాంధీ నిర్వహించిన కీలక భేటీకి హాజరైన తర్వాత మనస్సు మార్చుకున్నారు.. రాహుల్ గాంధీని చూసిన తర్వత.. గతంలో ఏం మాట్లాడినా..? అనేది మర్చిపోయానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జగ్గారెడ్డి.. కాగా, పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డిపై ఓపెన్‌గా విమర్శలు గుప్పిస్తూ వచ్చిన జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ అధిష్టానంపై విమర్శలు గుప్పించిన సందర్భాలు తక్కువే.. ఇక, గాంధీ కుటుంబంపై ఎప్పటికప్పుడు తన అభిమానాన్ని, విధేయతను ప్రకటిస్తూనే వచ్చారు జగ్గారెడ్డి.. ఇవాళ రాహుల్‌తో జరిగిన సమావేశంలో మనస్సు మార్చుకుని.. రాజీనామా లేఖను విత్‌డ్రా చేసుకుంటున్నట్టు వెల్లడించారు.

Exit mobile version