NTV Telugu Site icon

Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్‌ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన

Jagga Reddy

Jagga Reddy

Jagga Reddy: కాంగ్రెస్ పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్‌ కు రావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, పార్టీ చేరికల కమిటీ సూచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక కారణాల వల్ల పార్టీ వీడి పోయిన నాయకులను తిరిగి పార్టీలోకి ఆహ్వానించాలని ఏఐసీసీ ఆదేశాలు జారీ చేశారు. ఏ కారణం చేత అయిన పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులు తిరిగి పార్టీలో చేరి పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఏఐసీసీ ఆదేశించారు. పార్టీలో చేరే వారు బేషరతుగా పార్టీ లోకి ఆహ్వానించాలని, పార్టీ జిల్లా నాయకులు, నియోజక వర్గ నాయకులు పెద్ద మనసు చేసుకొని వారిని ఆహ్వానించాలని ఏఐసీసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక వర్గాలలో పార్టీ నుంచి వెళ్లిపోయిన నాయకులను తిరిగి పార్టీలోకి తీసుకోవాలని ఏఐసీసీ సూచనలు చేసింది.

Read also: YS Bharathi Election Campaign: వైఎస్‌ భారతికి పులివెందుల బాధ్యతలు..

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం పట్ల ఆకర్షితులైన ఇతర పార్టీ నాయకులు, పార్టీ విధి విధానాలు అర్థం చేసుకొని పార్టీలో పనిచేసేందుకు ఆసక్తి ఉన్న వారు కూడా పార్టీలోకి ఆహ్వానించాలన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ.. కలిసికట్టుగా పనిచేసి ప్రజా వ్యతిరేక విధానాలను పాటిస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలను ఓడించే లక్ష్యంగా అందరూ కలిసి కట్టుగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రేపు ఉదయం నుంచి సాయంత్రం గాంధీ భవన్ లో చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు వచ్చే నాయకులు మీ నియోజక వర్గ ఎమ్మెల్యే లకు గాని, నియోజక వర్గ ఇంచార్జ్ గాని, డీసీసీ అధ్యక్షులు సమాచారం ఇచ్చి గాంధీ భవన్ కు రాగలరని నాయకులకు సూచించారు.
Tihar Jail : తీహార్ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. నలుగురికి గాయాలు

Show comments