NTV Telugu Site icon

Jagga Reddy: కాంగ్రెస్‌కు గుడ్‌బై..? రేపే అనుచరులతో భేటీ

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. పార్టీని వీడుతున్నారా? అనే ప్రచారం జోరుగా సాగుతోంది… ఆయన రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్‌పై ప్రసంశలు కురిపించిన ఆయన.. ప్రభుత్వ పథకాలను ప్రశంసించారు.. ఇదే సమయంలో.. మంత్రి హరీష్‌రావును టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు.. మరోవైపు.. కాంగ్రెస్‌ పార్టీలో పరిస్థితులపై కూడా బహిరంగంగా ఆయన వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఎన్నో..

Read Also: Dharmana: కేసీఆర్‌ వ్యాఖ్యలతో పనిలేదు.. బోర్లకు మీటర్లతో నష్టం లేదు..!

మరోవైపు, సంగారెడ్డిలో రేపు తన ముఖ్య అనుచరులు, నాయకులతో కీలక సమావేశం నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు జగ్గారెడ్డి.. ఈ భేటీలో తన భవిష్యత్ కార్యాచరణపై నియోజకవర్గ ముఖ్య నేతలతో చర్చించనున్నట్టుగా సమాచారం.. తన అనుచరులు, నేతల నుంచి సలహాలు, సూచనలు ఇప్పటికే తీసుకున్నట్టుగా కూడా ప్రచారం సాగుతోంది.. రాజకీయ భవిష్యత్‌పై రేపు కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉందనే ప్రచారం సాగుతోంది.. సీఎం కేసీఆర్‌ బర్త్‌డే రోజు టి. కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమాలపై జగ్గారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే కాగా… అసలు కేసీఆర్‌ బర్త్‌డేకు నిరుద్యోగ సమస్యకు లింకేంటి? అంటూ ప్రశ్నించారు. మరోవైపు.. టి.పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పోస్ట్‌పై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. తాను నియోజకవర్గానికే పరిమితం అవుతానంటూ కూడా వ్యాఖ్యానించారు.. తనపై కోవర్ట్ అని ప్రచారం చేస్తున్నారని.. నా వళ్లే సమస్య అయితే.. తానే పార్టీ నుంచి వెళ్లిపోతానని కూడా జగ్గారెడ్డి వ్యాఖ్‌యానించినట్టు తెలుస్తోంది.