ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి… రాహుల్ గాంధీకి అసద్ సవాల్ చేయాల్సిన అవసం ఏముంది..? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ వచ్చింది రైతుల కోసం.. అసద్ కి నేను సవాల్ వేస్తున్నా.. నీ జిందగీలో ఎప్పుడైనా ప్రజా సమస్యలపై పోరాటం చేశావా..? అని నిలదీశారు. 12 శాతం రిజర్వేషన్ ఇస్తా అని మోసం చేస్తే ఎందుకు మాట్లాడటం లేదని మండిపడ్డ ఆయన.. తెలంగాణ ఇచ్చిన రాహుల్.. ఇక్కడ రైతులు ఎలా ఉన్నారు అని తెలుసుకుందాం అని వచ్చారు.. నీవేమి చేయాలో ఆ పని ముందు చేయి అంటూ సూచించారు.
Read Also: Etela Rajender: కష్టం, శ్రమ మనది.. దోపిడీ కేసీఆర్‌ది..!
రాహుల్ గాంధీ కుటుంబం అంతా దేశం కోసం త్యాగం చేసింది.. అలాంటి కుటుంబాన్ని సవాల్ చేస్తావా..? అని ప్రశ్నించారు జగ్గారెడ్డి.. నేను కూడా నీకు సవాల్ చేస్తున్నా.. రాహుల్ గాంధీకి దరఖాస్తు రాస్తా.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో హైదరాబాద్ సీటు నుండి పోటీ చేస్తా.. నీకు రాహుల్ గాంధీ అవసరం లేదన్నారు. సోనియా, రాహుల్ గాంధీకి లేఖ రాస్తా..? అసద్ మీద పోటీ చేస్తా అని.. కాంగ్రెస్ పార్టీ అరుగుల మీద కూర్చున్న విషయం మర్చిపోయారా..? అంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు, వైఎస్, రోశయ్యను పొగిడింది నిజం కాదా..? అని నిలదీశారు. ఇక, మెదక్‌లో పోటీ చేసే దమ్ముందా ..? అంటూ అసదుద్దీన్ ఒవైసీకి సవాల్ చేశారు జగ్గారెడ్డి.. హైదరాబాద్ కాకుండా ఇంకో పార్లమెంట్ సీటులో పోటీ చేసే దమ్ముందా..? అని ఎద్దేవా చేశారు. కాగా, రాహుల్‌కు దమ్ముంటే.. హైదరాబాద్ ఎంపీ సీటుకు పోటీ చేయాలంటూ అసదుద్దీన్ ఒవైసీ సవాల్ చేసిన విషయం తెలిసిందే.
