రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా..మోడీల ఆదేశాల మేరకు గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు అని, రాజస్థాన్ లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలి..లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు జగ్గా రెడ్డి. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ ని తిడితేనే హరీష్ ని టివి లో చూపిస్తరని .. మట్లాడుతున్నారని, రాహుల్ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు జగ్గారెడ్డి.
అంతేకాకుండా..’. అమ్మవారి పేరుతో కూడా కులాలు ఉన్నాయి.. గుర్తింపు లేని ఈ కులాలను కూడా రాహుల్ గాంధీ అండగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ ని గుర్తించారు.. ప్రధాని కావాలని జనం నిర్ణయించుకున్నారు. దీంతో మోడీకి దడ మొదలైంది. ఎస్సీ, ఎస్టీలు రాహుల్ గాంధీ వైపు ఉన్నారనే దడ మొదలైంది. మొదటిసారి.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఎస్సీ, ఎస్టీలకు వ్యతిరేకం కాదు అని చెప్పుకునే పరిస్థితికి తెచ్చింది రాహుల్ గాంధీ. అమిత్ షా గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులను పంపాడు అంటే రాహుల్ గాంధీ అంటే దడ పుట్టింది. మోడీ పదేళ్లు ప్రధానిగా ఉండి.. అబద్ధాలు ఆడటం భావ్యమా? అమిత్ షా.. మోడీ లకు భయం పట్టుకుని ఢిల్లీ పోలీసులను గాంధీ భవన్ పంపారు. మోడీ .. అబద్ధాలు నిజం అన్నట్టు చేసి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ మీద ఎన్ని అబద్ధాలు చెప్పారు మోడీ. తాళి బొట్టు తెంచి ముస్లింలకు ఇస్తారని ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి చేయడం దారుణం. ఒక్క ఆధారం అయినా ఉందా..? రుజువు చూపిస్తే ముక్కు నేలకు రాస్తా.
లేదంటే మీరు ముక్కు నేలకు రాయాలి .. చెవులు పిండుతం. మోడీకి అబద్ధాలు చెప్పి ట్రైనింగ్ ఇస్తున్న ప్రొఫెసర్ ఎవరు.. క్రిమినల్ మైండ్ తో పవర్ కోసం దిగజారుడు అవసరమా..?. ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది..మోడీకి ఎందుకు నోటీసు ఇచ్చారు. ఎన్నికల కమిషన్ డమ్మిగా మారింది. ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కి వచ్చారు కానీ.. ఎన్నికల కమిషన్ మోడీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. ఎలక్షన్ కమిషన్ ఇంటి నౌకర్ గా బీజేపీ భావిస్తుంది.. పద్దతి కాదు. ఎన్నికల సందర్భంగా మోడీ వస్తున్నారు కాబట్టి నిరసన చెప్పడం లేదు..లేదంటే అడ్డుకునే వాళ్ళం. 14 సీట్లు గెలిపించి రాహుల్ గాంధీని ప్రధాని ని చేయండి..ప్రజలకు విజ్ఞప్తి.. హరీష్.. రేవంత్ మీద మాట్లాడకపోతే టీవీ లో కనపడడు కదా.. అందుకే రేవంత్ మీద మాట్లాడుతున్నాడు.. బీజేపీ కాంగ్రెస్ కలుస్తుందా..? పుట్టు శత్రువులం.. కాంగ్రెస్ రాజకీయం ముందు బీజేపీ బచ్చా’ అని జగ్గారెడ్డి అన్నారు.
