Site icon NTV Telugu

Jagga Reddy: నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే..!

Jaggareddy

Jaggareddy

Jagga Reddy: నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే అని సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టెర్రరిస్టు విధానాలకు కాంగ్రెస్ వ్యతిరేకమన్నారు. అందుకే.. ఇందిరా.. రాజీవ్ గాంధీ లు బలి అయ్యారన్నారు. ప్రజల కోసం పని చేసే నక్షలైట్లు జనజీవనంలో కలవాలని వైఎస్‌ చర్చలకు పిలిచారన్నారు. నక్సలైట్లు జనజీవనంలో కలిసేలా నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. రాజకీయ నాయకులు.. చట్టపరిధిలో మేలు చేసే ఉద్యమాలు చేయాలన్నారు. నక్షలైట్లు ప్రజాలకోసమే పని చేసినా.. చట్టవ్యతిరేకం కావడంతో అడవిలో ఉండి ఇబ్బందులు పడ్డారన్నారు. రాజకీయ నాయకులు.. నక్సలైట్లు ప్రజల కోసమే పని చేస్తారన్నారు.

Read also: MLA Redya Naik: హైదరాబాద్ లో నాకు భూమి ఉన్నట్లు నిరూపిస్తే.. రాజకీయ సన్యాసం తీసుకుంటా

కాంగ్రెస్ పార్టీ టెర్రరిస్టులు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయన్నారు. నక్సల్ జనజీవనంలో కలిసి పని చేసేలా నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. ఇక రేవంత్‌ పాదయాత్రపై ప్రస్తావన రావడంతో.. దానిపై జగ్గారెడ్డి మాట్లాడుతూ.. పాదయాత్ర ఎవరైనా చేయొచ్చన్నారు. రేవంత్ తిరగుతున్నడు.. తప్పేముందని స్పష్టం చేశారు. అసెంబ్లీ తరవాత ఎమ్మెల్యేలు అంతా ఎవరి నియోజకవర్గంలో వాళ్ళం పాదయాత్ర చేస్తామన్నారు. నన్ను ఎవరైనా పిలిస్తే.. అక్కడికి వెళ్లి పాదయాత్ర చేస్తానన్న జగ్గారెడ్డి మరి రేవంత్ పిలిస్తే పాదయాత్రకు వెళ్తారా ? అనే ప్రశ్నలకు జగ్గారెడ్డి నో.. కామెంట్స్ అంటూ ఆప్రశ్నను దాటివేసిన జగ్గరెడ్డి నా లైఫ్ ఇంకా ముత్యాల ముగ్గు హీరోయిన్ లాంటిదే అంటూ మాట్లాడిన మాటలు ఇప్పడు హాట్‌ టాపిక్‌ అయ్యాయి.
Assembly premises: అసెంబ్లీ ఆవరణలో ఈటెల, వీహెచ్.. వాటిపై చర్చ

Exit mobile version