Cold in Telangana: తెలంగాణ రాష్ట్రంలో చలి వణికిస్తోంది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనాలు బయటకు రావడానికి జంకుతున్నారు. సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్దిరోజులుగా చలి తీవ్రత కాస్త తగ్గిడంతో ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి గజగజ వణికిస్తోంది. నిన్నటి నుంచి పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో చలి తీవ్రత ఇంతకు ఇంతై నరాలను తెంచే విధంగా పెరుగుతుంది. నిన్నటి తో పోలిస్తే చలి ఇవాళ మరింతగా ఎక్కువైంది. రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఈశాన్య దిశ నుంచి గాలులు వాతావరణంపై ప్రభావం చూపుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రెండు రోజులుగా చలి తీవ్రత తగ్గిన మళ్లీ ఇవాళ చలి తీవ్రత మరింతగా పెరిగింది. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది ఎదుర్కొన్నారు. బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.
Read also: AR Rahman: కడప ఉరుసు ఉత్సవాల్లో రెహమాన్
నిన్ని రాత్రి నుంచి చలి తీవ్రత మరింతగా పెరిగడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉష్ణోగ్రతలు .. సంగారెడ్డి జిల్లా కోహిర్ లో 11.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా.. మెదక్ జిల్లా దొంగల ధర్మారం లో 11.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సిద్దిపేట జిల్లా హబ్సిపూర్ లో 11.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యాయి. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా లో 10.3గా నమోదు. కొమురంభీం జిల్లాలో 10.6 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచిర్యాల జిల్లా లో 11.2గా నమోదు కాగా.. నిర్మల్ జిల్లాలో 11.9 డిగ్రీలు గా కనిష్ట ఉష్ణోగ్రత లు నమోదైంది. నిన్న చలి తీవ్రత కాస్త తగ్గినా.. రెండు రోజులుగా చలి తగ్గింది అని ఊపిరి పీల్చుకున్న రాష్ట్ర ప్రజలకు మళ్లీ చలి పెరగడంతో బయటకు రావడానికి భయంతో జంకుతున్నారు. ప్రయాణికులు చలిలో ప్రయాణించేందుకు జంకుగుతున్నారు. రాత్రి కన్నా ఉష్ణోగ్రతలు పడిపోతుండటంతో ఉదయం చలి తీవ్రత ఎక్కవగా పెరిగింది.ఈశాన్య దిశ నుంచి గాలులు వాతావరణంపై ప్రభావమే అని వాతావరణ శాఖ పేర్కొంది. చలి తీవ్రత పెరగడంతో.. ప్రజలు ప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Election Results: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్స్ లైవ్ అప్డేట్స్
