Site icon NTV Telugu

Rain Alert: మరో రెండ్రోజులు వర్షాలే.. వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ

Telangana Rain

Telangana Rain

తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న (ఆదివారం) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉదయం వరకు వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయి. చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలకు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దిల్ సుఖ్ నగర్, కోఠి, లక్డీకపూల్, అమీర్ పేట్ ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. పుత్లిబౌలి, ఎంజే మార్కెట్, గన్ పార్క్ పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచింది. రాజేంద్రనగర్ లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం భీభత్సాన్ని సృష్టించింది.

అత్తాపూర్, కాటేదాన్, మైలార్ దేవ్ పల్లి, బండ్లగూడ, నార్సింగీ, గండిపేట ప్రాంతాలలో వర్షం కారణంగా గత రెండు గంటలుగా పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో కాలనీ వాసులు ఇబ్బంది తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇక రానున్న మూడు గంటల పాటు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురు గాలులతో వర్షం కురిసే అవకావం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. హైదరాబాద్‌లో మరో రెండు రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉందని వెల్లడించారు.

ఇవాల జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, ములుగు, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నారాయణపేట్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, హైదరాబాద్, యాదాద్రి భువనపల్లి, హైదరాబాద్ జిల్లా. ఓ చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.

రేపు (23న) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాపలల్లి, ములుగు, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట్, హైదరాబాద్, రంగారెడ్డి, ఖాయం కర్నూలు, సిటీ మల్కాజిలగిరి, సిటీ మల్కాజిలగిరి. డెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

అలాగే 24న రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, నిర్మల్‌, జగిత్యాల, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, వికారాబాద్‌, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నారాయణపేట్‌, జోగులాంబ గద్వాల్‌, మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లొండ, హైదరాబాద్‌, హైదరాబాద్‌, హైదరాబాద్‌, మేడ్చల్‌ హైదరాబాద్‌, మేడ్చల్‌ R. రంగా రెడ్డి మరియు మేడ్చలరంగా జిల్లాలు. వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల పాటు పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కొద్ది రోజులుగా ఎండలతో అల్లాడుతున్న జనం తాజా వర్షాలతో కాస్త ఊరట పొందుతున్నారు.
Astrology : మే 22, సోమవారం దినఫలాలు

Exit mobile version