తెలంగాణ ప్రజలకు బిగ్ అలెర్ట్.. మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. రాగల ఐదురోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని సూచించింది.. ఇప్పటికే గత రెండు, మూడు రోజులు భారీ వర్షాలు కురిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఐదు రోజులు అంటే జనాలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. అక్టోబర్ 3 వరకు తెలంగాణ వ్యాప్తంగా…
తెలంగాణలో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. నిన్న (ఆదివారం) రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉదయం వరకు వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయం కాగా, పలు చోట్ల వర్షపు నీరు రోడ్లపైనే నిలిచింది.