Malla Reddy IT Raids: మంత్రి మల్లారెడ్డి, బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిసాయి. రెండు రోజుల పాటు 65 బృందాలతో దాదాపు 400 మంది ఐటీ అధికారులతో సోదాలు నిర్వహించారు. ఇప్పటి వరకు రూ.10.50 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. సోదాలు ముగిసిన తర్వాత సోమవారం ఐటీ ముందు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేశారు. ఇక మంత్రి మల్లారెడ్డి బంధువుల ఇళ్లలో నగదు స్వాధీనం చేసుకున్నారు. రఘునందన్ ఇంట్లో రూ.2 కోట్లు, త్రిషూల్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, సుధీర్‌రెడ్డి ఇంట్లో రూ.2.50 కోట్లు, ప్రవీణ్‌రెడ్డి ఇంట్లో కోటి, మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ ఇంట్లో రూ.3 కోట్లు ఐటీ అధికారులు సీజ్ చేశారు. నిన్న ఐటీ అధికారులు మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఇంట్లో ముగిసిన సోదాలు చేపట్టారు. 48 గంటల పాటు తనిఖీలు కొనసాగింది. సోదాల్లో రూ.3 కోట్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 2 సూట్ కేసులు, 6 బ్యాగుల్లో వివిధ డాక్యుమెంట్స్, మనీ స్వాధీనం చేసుకున్నారు.
Read also: Shivani Rajashekar: ఆ విషయంతో పోలిస్తే నాది చిన్నదే అంటున్న శివాని రాజశేఖర్
తెలంగాణ మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన బంధవులు ఇళ్లల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహిందిచింది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కోట్ల రూపాయల పేరుతో డొనేషన్లు తీసుకున్నారని ఐటీ ఆరోపణతో.. మల్లారెడ్డి ఇద్దరు కొడుకులతో 100 కోట్ల డొనేషన్లపై ఐటీ సంతకాలు పెట్టిచ్చేందుకు ప్రయత్నించింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాలలో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని ఐటి మహేందర్ రెడ్డితో సంతకం పెట్టించింది. మెడికల్ కాలేజీలో విద్యార్థుల నుంచి 100 కోట్ల రూపాయలు వసూలు చేశారని భద్రారెడ్డితో సంతకం పెట్టించే ఐటీ ప్రయత్నం చేసింది. అయితే.. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని మల్లారెడ్డి ఐటీ అధికారులతో వాదన దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే లావాదేవులో ప్రతిదానికి లెక్కలు ఉంటాయని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. అయితే రెండు రోజుల ఐటీ హైడ్రాలమతో నిన్న అర్ధరాత్రితో ఐటీ సోదాలు ముగిసాయి. అయితే మళ్లీ ఐటీ సోదాలు కొనసాగుతాయా? అనే ప్రశ్నలు మాత్రం అందరిలో ఉత్కంఠంగా మారుతుంది.
