NTV Telugu Site icon

IT Raids: హైదరాబాద్‌ లో ఐటీ రైడ్స్‌ కలకలం.. మంత్రి సబితా బంధువుల ఇంటిపై దాడులు

It Raids

It Raids

IT Raids: తెలంగాణలో ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. ఓటింగ్‌కు 17 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపాయి. ఉదయం నుంచి నగరంలోని పలు చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్‌, సిబ్బంది, ఇంటి కార్యాలయంలో సోదాలు చేస్తున్నారు. మొత్తం 15 చోట్ల ఈ దాడులు జరుగుతున్నాయి. మై హోం శాఖలో ఉన్న తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయ నాయకులను టార్గెట్ చేసిన ఐటీ అధికారులు ఇప్పుడు ఫార్మా కంపెనీలను టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ నేతలకు ఫార్మా కంపెనీలు నిధులు ఇస్తారనే అంచనాతో ఈ దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.

నాలుగు రోజుల క్రితం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై కూడా ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఖమ్మంతో పాటు హైదరాబాద్‌లోని ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ దాడులు జరిగాయి. వారం రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్‌ నాయకుడు పారిజాత నరసింహారెడ్డి, ఆ పార్టీ అభ్యర్థి కేఎల్‌ఆర్‌, మాజీ మంత్రి జానా రెడ్డి నివాసాలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరావు ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు. ఈ దాడులపై కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పరస్పరం కుమ్మక్కయ్యాయని, తమ పార్టీ నేతల ఇళ్లను టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికలకు ముందు గ్రూపుల వారీగా ఐటీ దాడులు చేస్తున్నారని ఘాటుగా విమర్శించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం బీఆర్‌ఎస్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

TDP-Janasena Manifesto Committee: నేడు టీడీపీ – జనసేన మేనిఫెస్టో కమిటీ సమావేశం