Site icon NTV Telugu

IT Raids in Hyderabad: హైదరాబాద్ చట్నీస్‌ హోటల్స్‌పై ఐటీ దాడులు..!

Chitines It Raids

Chitines It Raids

IT Raids in Hyderabad: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ప్రముఖ బ్రేక్‌ఫాస్ట్ ఫ్రాంచైజీ చట్నీస్ హోటల్స్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. హోటళ్లతోపాటు వాటి యజమానుల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఆ సంస్థ యజమాని అట్లూరి పద్మ, ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ షర్మిలకు స్నేహితురాలు కావడం గమనార్హం. అట్లూరి పద్మ కుమార్తె వివాహం ఇటీవల షర్మిల కుమారుడు రాజా రెడ్డితో జరిగిన సంగతి తెలిసిందే. కాగా.. జంట నగరాల్లో చట్నీస్ హోటళ్లు ప్రసిద్ధి చెందాయి. అట్లూరి పద్మ పదేళ్ల కిందటే ఈ హోటల్‌ను ప్రారంభించి ప్రస్తుతం నగరంలో అనేక శాఖలను విజయవంతంగా నడుపుతున్నారు. తాజాగా ఐటీ దాడుల వార్త సంచలనంగా మారింది. దీనిపై ఇటు చట్నీల యాజమాన్యం కానీ, అటు ఐటీ అధికారులు కానీ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.

Read also: RCB – Siddharth: హీరో సిద్ధార్థ్ ట్వీట్ పై నెటిజన్ల ఆగ్రహం..!

అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న మేఘనా ఫుడ్స్ ఫుడ్స్‌ ఈటరీస్‌ పై కూడా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫ్రాంచైజీలు బెంగళూరుతో పాటు నగరంలో కూడా ఉన్నాయి. అయితే ఈ దాడులకు సంబంధించి హోటల్ యజమానులు, ఐటీ అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని రాయదుర్గం, మొయినాబాద్ కోకాపేటలో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఓ ఫార్మా కంపెనీతో పాటు మరో తొమ్మిది చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఐటీ దాడులు జరగడం సంచలనంగా మారింది.
Suriya: సూర్య ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ పోస్ట్ తో నిరాశ..

Exit mobile version