Site icon NTV Telugu

Pailla Shekar Reddy: పైళ్ల శేఖర్ రెడ్డిని విచారించిన ఐటీ.. ఆ పత్రాలు అందించిన అధికారులు

Pailla Shekar Reddy

Pailla Shekar Reddy

Pailla Shekar Reddy: భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఇవాళ ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇవాళ ఆయనకు విచారణ హాజరు కావాలన్న నేపథ్యంలో ఐటీ కార్యాలయానికి ఎమ్మెల్యే వెళ్లారు. ఆయనను ఐటీ అధికారులు విచారించారు. కొద్ది సేపు విచారించిన అనంతరం పైల్ల శేఖర్ రెడ్డి కి పంచనామా పత్రాలు ఐటీ అధికారులు అందజేశారు. కొన్ని అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలపై పైళ్ల నుండి ఐటీ అధికారులు వివరణ తీసుకున్నట్లు సమచారం. దీంతో పైళ్ల శేఖర్‌ రెడ్డితో ఐటీ విచారణ ముగిసింది. ఇటీవల హైదరాబాద్‌లోని పైల శేఖర్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాల్లో భాగంగా ఐటీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత విచారణకు హాజరుకావాలని పైల శేఖర్ రెడ్డికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో ఈరోజు పైళ్ల శేఖర్ రెడ్డి ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు.

Read also: Honda Shine 125 Launch 2023: హోండా కొత్త 125cc బైక్‌ విడుదల.. ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

కాగా, ఇటీవల మెదక్ ఎంపీ కోట ప్రభాకర్ రెడ్డితో పాటు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్ రెడ్డితోపాటు పైల శేఖర్ రెడ్డి నివాసాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. కోట ప్రభాకర్ రెడ్డి నివాసంలో ఐటీ అధికారులు ఒక్కరోజు సోదాలు నిర్వహించగా, ఎమ్మెల్యేలు పైల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి నివాసాలు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడు రోజుల పాటు సోదాలు చేశారు. ఈ సోదాలు కక్ష సాధింపు చర్యలేనని నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా శేఖర్ రెడ్డి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న భువనగిరి నియోజకవర్గంలో మీడియాతో మాట్లాడుతూ తన ఇమేజ్ ను డ్యామేజ్ చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మూడు రోజులుగా తన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించగా ఎలాంటి అక్రమ ఆస్తులు కనిపించలేదని, అధికారులు ఒక్క డాక్యుమెంట్ కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు. ‘‘ఐటీ సోదాలపై మూడు రోజులుగా మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి.. ఐటీ అధికారులు నా ఇంట్లో, బంధువుల ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని, నేను దక్షిణాఫ్రికాలో మైనింగ్ వ్యాపారం చేస్తున్నానని కొన్ని కథనాలు వచ్చాయి. ఈ కథనాలలో నిజం లేదని చెప్పుకొచ్చారు.

Exit mobile version