ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్‌డౌన్ సమయం ముగియనున్నది. జూన్ 9 నుంచి పది రోజులపాటు లాక్‌డౌన్‌ను పొడిగించిన సంగతి తెలిసిందే. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు సడలింపులు ఇచ్చారు. అయితే, జూన్ 20 నుంచి లాక్‌డౌన్ ను పొడిగిస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నారు. మంత్రుల నుంచి, ఆరోగ్యశాఖ నుంచి ముఖ్యమంత్రి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ తీసుకున్నట్టు సమాచారం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. పైగా ఈనెల 21 నుంచి కేంద్రం 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ను అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్‌ను జూన్ 20 నుంచి ఎత్తివేస్తారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూన్ 19 తరువాత రాష్ట్రంలో కేసీఆర్ పర్యటనలు కూడా ఉండటంతో లాక్‌డౌన్‌పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
ఈ నెల 20 తరువాత రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేస్తారా? సడలింపులు పెంచుతారా?
Show comments