వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన స్థానంలో హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగనాథ్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రభుత్వ నియమించింది.. ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆకస్మిక బదిలీ ఎందుకు జరిగింది. కేవలం ఒక్క ఐపీఎస్ అధికారి మాత్రమే బదిలీ జరగడంతో ఏదైనా రాజకీయ కోణం ఉందా..? అనే చర్చకు తెర లేచింది. వరంగల్ పోలీస్ కమిషనర్ పోస్టు డీఐజీ హోదా అధికారులు చేసేది.. డీఐజీ క్యాడర్ లో వరంగల్ పోలీసు కమిషనర్ గా 2021 ఏప్రిల్ లో బాధ్యతలు తీసుకున్న తరుణ్ జోషి తన మర్కు చూపిస్తూ పని చేశారు. 2022 జనవరిలో ఐజీగా ప్రమోషన్ వచ్చింది. ఐజీ ప్రమోషన్ పొందిన తర్వాత బదిలీపైనా హైదరాబాద్ కి వెళ్ళిపోతారు. వరంగల్ కి కొత్త పోలీస్ కమిషనర్ వస్తారని అంచనా వేశారు. ఈ అంచనాలను తలక్రిందులు చేస్తూ తరుణ్ జోషి ఐజీ హోదా పొందిన కూడా వరంగల్ పోలీస్ కమిషనర్ గానే 11 నెల పాటు విధులు నిర్వహిస్తువచ్చారు. ఇలాంటి వరంగల్ పోలీసు కమిషనర్ ఎందుకు ఆకస్మిక బదిలీ అయ్యారు.. ఆయన బదిలీకి కారణం ఏంటి ఇప్పుడు ఇదే పోలీసు వర్గాలతో పాటు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ.
Read Also: Nara Brahmani : వావ్.. నారా బ్రహ్మణిలో మరో టాలెంట్.. లడక్‌లో బైక్ రైడింగ్ వీడియో..
డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చే నెలలో పదవీ విరమణ ఉన్న నేపథ్యంలో వచ్చే నెలలో కొందరి సీనియర్ అధికారుల బదిలీ ఉంటాయి అని ఊహాగానాలు ఉన్నాయి.. కానీ, ఈ అంచనాలను తారుమారు చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఒక్కరికే బదిలీ ఉత్తర్వులు వేలుబడడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. తరుణ్ జోషి బదిలీ.. వైఎస్ షర్మిల ఎపిసోడ్ ఏమన్నా లింక్ ఉందా? నర్సంపేటలో షర్మిల పాదయాత్ర సందర్భంగా జరిగిన గొడవ నేపథ్యంలోనే పోలీసుల వైపల్యాన్ని ఎత్తి చూపుతూ ప్రభుత్వం ఈ బదిలీకి నిర్ణయం తీసుకుందా..? నిజానికి గత శుక్రవారం నుండి వరంగల్ పోలీసు కమిషనర్ తరుణ్ జోషి లీవ్ లో ఉన్నారు. గురువారం వరకు ఆయన లీవ్ లోనే ఉండగా.. బుధవారం రాత్రికి బదిలీ ఉత్తర్వులు రావడం చర్చకు కారణం అయ్యింది. లేక వరంగల్ లోని క్రింది స్థాయి పోలీసు సిబ్బంది తీరు నోచుకున్న వరంగల్ పోలీసు కమిషనర్. ఆయన బదిలీకి కోరుకున్నారా…? నర్సంపేటలో షర్మిల కాన్వాయ్ మీద జరిగిన దాడికి పనిష్మెంట్ గా ఆయన బదిలీ జరిగిందా? ఇలాంటి చర్చలు వరంగల్ పోలీసు అధికారులతో పాటు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఏకైక పోలీస్ అధికారి బదిలీ కావడం ఈ చర్చలకు కారణమైంది.
ఇక, తరుణ్ జోషి స్థానంలో రంగనాథుని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో అన్ని వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. వైఎస్ షర్మిల పాదయాత్ర సందర్భంగా జరిగిన ఎపిసోడ్ లో పోలీసులు సరిగా వ్యవహరించకపోవడం వల్ల హైదరాబాద్‌లో రచ్చకు కారణమైందని వరంగల్ పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి ఉంటే హైదరాబాద్‌లో అంత సీను జరిగేది కాదనే విమర్శలు పెరిగిన నేపథ్యంలో ఆయన బదిలీ జరిగిందని కొందరు అంటుంటే.. షర్మిల ఎపిసోడ్ లో హైదరాబాద్ పోలీసు సరిగా పని చేయకపోవడంతో సమర్ధుడైన తరుణ్ జోషిని ఆకస్మిక బదిలీ చేసి కీలక పోస్టు ఇస్తారని.. ఆ క్రమంలో ఈ బదిలీ జరిగిందనే వారు ఉన్నారు. ఏదేమైనా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.