CM KCR: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ఈ నెల 12న పునఃప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకానున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. ఈనేపథ్యంలో కీలక చర్చ తెరపైకి వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ఈ కార్యక్రమానికి వెళ్తారా అనే చర్చ సాగుతోంది. ఈ క్రమంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్రం నుంచి కేసీఆర్‌కు ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కేసీఆర్‌కు లేఖ రాశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి రాసిన లేఖపై కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. మోడీ తెలంగాణ టూర్‌పై టీఆర్ఎస్ ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. విభజన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మేధావులు ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు.
ప్రధాని పర్యటనను అడ్డుకుంటామని వామపక్షాలు ఇప్పటికే ప్రకటించాయి. ఈ నేపథ్యంలో.. కేంద్ర మంత్రి లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వెళితే వామపక్షాలు, టీఆర్ఎస్ వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు తెలంగాణ బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇతర నేతలతో కలిసి ప్రధాని మోదీ ప్రసంగించే బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ పునరుద్ధరణకు కేంద్రం రూ.6,120 కోట్లు వెచ్చించింది. దీని వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ ఎరువుల కర్మాగారాన్ని పునఃప్రారంభించడంతో తెలంగాణ, ఏపీ సహా దక్షిణ భారతదేశంలోని రైతులందరికీ ఎరువులు కొరత లేకుండా సరఫరా చేసేలా అవగాహన కల్పించాలని స్పష్టం చేశారు.
Shiva Sahasranama Stotram : కార్తిక గురువారం ఈ స్తోత్రం వింటే మహా శివుని దీవెనలతో కోరిన కోరికలు నెరవేరుతాయి