NTV Telugu Site icon

NACS: సైబర్ సెక్యూరిటీ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

Nacs

Nacs

నేషనల్ అకాడమీ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ (NACS) తన ఆన్‌లైన్ సైబర్ సెక్యూరిటీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్, పీజీ పూర్తి చేసిన ఆసక్తి గల అభ్యర్థులు ఆయా కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, పోస్ట్ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్, సర్టిఫికేట్ ఇన్ సైబర్ సెక్యూరిటీ వంటి కోర్సులు అందించబడతాయి.

స్వర్ణ భారత్ నేషనల్ లెవల్ స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద SC, ST, BC, EBC, OBC, మైనారిటీ, PH, మహిళా అభ్యర్థులు, ఎక్స్-సర్వీస్‌మెన్ మరియు వారి పిల్లలకు కోర్సు ఫీజులో NACS 50 శాతం వరకు ఫీజు రాయితీని అందిస్తుంది. కోర్సు పూర్తయిన తర్వాత, అభ్యర్థులు సైబర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ అనలిస్ట్, సెక్యూరిటీ ఆర్కిటెక్ట్, ఐటి సెక్యూరిటీ ఇంజనీర్, సిస్టమ్స్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్, ఇన్ఫర్మేషన్ రిస్క్ ఆడిటర్స్, సెక్యూరిటీ అనలిస్ట్స్ మరియు మరెన్నో ఉద్యోగ ప్రొఫైల్‌లలో అవకాశాలు పొందుతారు. మరిన్ని వివరాల కోసం www.nacsindia.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 7893141797కు కాల్ చేయవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తుకు ఆగస్టు 5వతేదీ చివరితేది అని ప్రకటించారు.

Afghanistan: దేశం విడిచిపెట్టిన హిందువులు, సిక్కులు తిరిగి రావాలంటున్న తాలిబన్లు

Show comments