Site icon NTV Telugu

Uppala Srinivas Gupta: అఖిల భారత హిందూ మహాసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి

Arya

Arya

అఖిల భారత హిందూ మహాసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ మరియు IVF రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా డిమాండ్ చేశారు. కోల్ కతా లోని రూబీ క్రాసింగ్ వద్ద అఖిల భారత హిందూ మహాసభ ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద మహిషాసురుని స్థానం లో మహాత్ముడిని పోలిన బొమ్మను ఏర్పాటు చేయడాన్ని ఇంటర్నేషనల్ వైశ్య తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. మంగళవారం నాగోల్ చౌరస్తా లో మహాత్మా గాంధీ విగ్రహానికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి 108 కొబ్బరికాయలు కొట్టారు.

Read Also: Shashi Tharoor: రాహుల్ గాంధీ అంగీకరించలేదు.. అందుకే!

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గాంధీని చంపిన గాడ్సే ప్రోత్సహిస్తూ, భారత జాతిపిత మహాత్మా గాంధీని అవమానపరుస్తున్నారని ఆయన అన్నారు. అహింస మార్గంతోనే గాంధీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో IVF పొలిటికల్ కమిటీ ఛైర్మన్ బచ్చు శ్రీనివాస్ గుప్తా, కో- ఆర్డినేటర్ నాగరాజు గుప్తా, ,IVF తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆలేటి రవి, కోల్పూరి నరేష్ గుప్తా ,IVF మహిళా విభాగ్ ఉప్పల స్వప్న, భువన మరియు ఆర్యవైశ్య నాయకులు పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ప్రతిష్టకు భంగం కలిగించేవారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Read Also: Fake NIA Officers Arrest: జగిత్యాలలో ఫేక్ NIA అధికారుల హల్ చల్..

Exit mobile version