Site icon NTV Telugu

Drug Trafficking Gang: హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం.. కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా

Drugs

Drugs

Drug Trafficking Gang: హైదరాబాదులో మరో సారి డ్రగ్స్ కలకలం రేపింది. డిసెంబర్ 31 వేడుకలను టార్గెట్ చేసి డ్రగ్స్ అమ్మకాలు జరిపేందుకు ప్రయత్నిస్తున్న ముఠా గుట్టును ఎస్వోటీ పోలీసులు రట్టు చేశారు. హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మల్కాజిగిరిలో ఎస్వోటీ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి 8 కిలోల ఎఫిడ్రిన్ డ్రగ్స్‌ను మల్కాజిగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.హైదరాబాద్ నుంచి కొరియర్ ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు పోలీసులు తెలిపారు.

Read also: Flu Vaccine: అయ్యా.. బాబూ అంటూ సౌదీఅరేబియా రిక్వెస్టులు…. ఎందుకో తెలుసా?

న్యూయర్ వేడుకలకు భారీగా డ్రగ్స్ సరఫరా జరిగినట్లు అధికారులు గుర్తించారు. కాగా, హైదరాబాద్ నుంచి కొరియర్ల ద్వారా విదేశాలకు డ్రగ్స్ సరఫరా అవుతున్నట్లు రాచకొండ పోలీసులు పేర్కొంటున్నారు. నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ దొరకడం హైదరాబాద్ లో కలకలం రేపింది.ఈ ముఠా వెనుక కీలక సూత్రధారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే.. హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియాను అడ్డుకునేందుకు పోలీసులు పకడ్బందీగా ప్లాన్‌లు వేస్తున్నారు. ఇటీవల దాడులు తీవ్రమయ్యాయి. ఒకవైపు న్యూయర్‌ వేడుకలు, మరో వైపు డ్రగ్స్‌ దందా సాగుతుండటంతో పోలీసులు అలర్ట్‌ అయ్యారు. కొత్తసంవత్సారాన్ని టార్గెట్‌ చేస్తూ డ్రగ్స్‌ దందా చేస్తున్న వారిని ఎక్కడికక్కడ అదుపులో తీసుకుంటున్నారు.
Dr Vaishali Case: పెళ్లి నిజం కాదు.. అవన్నీ మార్ఫింగ్ ఫోటోలు

Exit mobile version