NTV Telugu Site icon

ఇంటర్‌ పరీక్షలు రద్దు.. క్లారిటీ ఇచ్చిన మంత్రి సబిత

Sabitha Indra Reddy

Sabitha Indra Reddy

ఇంటర్‌ సెకండియర్ పరీక్షలను రద్దుపై అధికారికంగా ప్రకటించారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి… ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె… ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్‌ పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించారు.. ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ పరీక్షలు రద్దు చేశాం.. ఫస్ట్‌ ఇయర్‌ మార్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని.. ఫలితాలపై త్వరలోనే విధి విధానాలు రూపొందిస్తామని తెలిపారు. అయితే, విద్యార్థులెవరైనా పరీక్షలు రాయాలనుకుంటే మాత్రం… కరోనా మహమ్మారి పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆలోచిస్తాం అన్నారు.. ఇప్పటికే టెన్త్, ఇంటర్‌ ఫస్టియర్ విద్యార్థులను ప్రమోట్ చేశాం.. ఇంటర్‌ సెకండియర్ పరీక్షలు నిర్వహించాలని అనుకున్నాం.. కానీ, కరోనా మహమ్మారి కారణంగా.. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైందని.. దీంతో.. సీఎం కేసీఆర్‌ సూచనలతో.. పరీక్షలను రద్దు చేస్తున్నట్టు వెల్లడించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి.