NTV Telugu Site icon

Etala Rajender: కాంగ్రెస్ లో అగ్ర కులాల వారే సీఎం అవుతారు.. ఈటల ఇంట్రెస్టింగ్‌ కమెంట్‌

Etala Rajender

Etala Rajender

Etala Rajender: కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్ర కులాల వారే సీఎం అవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులే తప్ప ఇతరులు సీఎం కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని మోడీ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దళితులను, గిరిజనులని, బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్ర కులాల వారే సీఎం అవుతారని తెలిపారు. ప్రధాని మోడీ బీసీని సీఎం చేస్తా అంటే మీకు కోపమెందుకు? అని ప్రశ్నించారు. నేను గజ్వేల్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తే హరీశ్‌రావుకు కోపం వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. పదేళ్లు గడిచినా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.

కేసీఆర్ అనుమతి లేకుండా మంత్రులు ఏమీ చేయలేరని అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వకుండా గృహలక్ష్మి కింద 3 లక్షల కాగితాలు ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా? అని మండిపడ్డారు. పదేళ్లు దాటినా తెలంగాణకు రేషన్‌కార్డు ఇవ్వలేని దద్దమ్మలు బీఆర్‌ఎస్‌ నాయకులు అని ప్రజలే అంటున్నారని అన్నారు. మంత్రి హరీశ్ రావు స్వయంగా పని చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిదలకు గడ్డి పెడితే, ఆవులకు పాలు పోస్తే వస్తాయా అని కేసీఆర్ అన్నారు. అందుకే అదే మేము అంటున్నాం కేసీఆర్ కు ఓటు వేస్తే ఏమి రాదని. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తుందని అన్నారు. అంతేకాదు రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో మెరుగైన విద్యను అందిస్తామని ఈటల అన్నారు.
Kotha Manohar Reddy: మహిళలతో కలిసి గడప గడపకు ప్రచారం చేసిన కొత్త మనోహర్ రెడ్డి సతీమణి