Etala Rajender: కాంగ్రెస్ లో అగ్ర కులాల వారే సీఎం అవుతారు.. ఈటల ఇంట్రెస్టింగ్ కమెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Etala Rajender: కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్ర కులాల వారే సీఎం అవుతారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో ఈటల రాజేందర్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత వరకు వాళ్ళ కుటుంబ సభ్యులే తప్ప ఇతరులు సీఎం కాలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తామని మోడీ చెప్పారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకి దళితులను, గిరిజనులని, బీసీలను ముఖ్యమంత్రి చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో కూడా అగ్ర కులాల వారే సీఎం అవుతారని తెలిపారు. ప్రధాని మోడీ బీసీని సీఎం చేస్తా అంటే మీకు కోపమెందుకు? అని ప్రశ్నించారు. నేను గజ్వేల్‌లో ఎన్నికల్లో పోటీ చేస్తే హరీశ్‌రావుకు కోపం వస్తుందని ఈటల రాజేందర్ అన్నారు. గజ్వేల్ ప్రజల సమస్యలను సీఎం కేసీఆర్ పరిష్కరించలేదన్నారు. పదేళ్లు గడిచినా తెలంగాణలో కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు.
కేసీఆర్ అనుమతి లేకుండా మంత్రులు ఏమీ చేయలేరని అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఈటల ఈ వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో డబుల్ బెడ్ రూంలు ఇవ్వకుండా గృహలక్ష్మి కింద 3 లక్షల కాగితాలు ఇస్తానంటే ప్రజలు నమ్ముతారా? అని మండిపడ్డారు. పదేళ్లు దాటినా తెలంగాణకు రేషన్‌కార్డు ఇవ్వలేని దద్దమ్మలు బీఆర్‌ఎస్ నాయకులు అని ప్రజలే అంటున్నారని అన్నారు. మంత్రి హరీశ్ రావు స్వయంగా పని చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాడిదలకు గడ్డి పెడితే, ఆవులకు పాలు పోస్తే వస్తాయా అని కేసీఆర్ అన్నారు. అందుకే అదే మేము అంటున్నాం కేసీఆర్ కు ఓటు వేస్తే ఏమి రాదని. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తే ఇంట్లో ఇద్దరికి పింఛన్ వస్తుందని అన్నారు. అంతేకాదు రూపాయి ఖర్చు లేకుండా పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో మెరుగైన విద్యను అందిస్తామని ఈటల అన్నారు.
Kotha Manohar Reddy: మహిళలతో కలిసి గడప గడపకు ప్రచారం చేసిన కొత్త మనోహర్ రెడ్డి సతీమణి
Also Read
తాజావార్తలు
-
Srikanth Odela: ‘నువ్వు సింగిల్ టేక్ ఆర్టిస్ట్‌వి బిడ్డా’.. ‘పారడైజ్’ వివాదాస్పద సీన్‌పై శ్రీకాంత్ ఓదెల ఓపెన్ క్లారిటీ!
-
Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో మార్పులు..
-
Cyber Fraud: లేడీ మాయలో డాక్టర్.. ఫేస్బుక్ పరిచయంతో రూ.14.61 కోట్లు స్వాహా..!
-
OTT Release: ఓటీటీలోకి రూ.325 కోట్ల మలయాళ బ్లాక్‌బస్టర్.. ఎప్పుడు? ఏ ప్లాట్ఫామ్లో చూడొచ్చంటే?
-
TG SAFE : ఆదేశాలు బేఖాతరు.. యథేచ్ఛగా రెస్టారెంట్లు ఓపెన్..!
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?