NTV Telugu Site icon

Inter Supplementary: ఇంటర్‌ హాల్‌ టికెట్లు విడుదల.. మే 24 నుంచి పరీక్షలు..

Inter Suplymentery

Inter Suplymentery

Inter Supplemetary: తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టిక్కెట్లను ఇంటర్మీడియట్ బోర్డ్ విడుదల చేసింది. హాల్ టిక్కెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో మే 17న అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రోల్‌ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయడం ద్వారా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ బోర్డ్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 24 నుంచి జూన్ 3 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగగా.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతాయి.

Read also: RamaJogayya Sastry : ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..’అని’ అదరగొడతాడు..

ఇక జూన్ 4 నుండి 8 వరకు విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. కాగా.. మొదటి సెషన్‌లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు రెండవ సెషన్‌లో మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 5 గంటల వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడతాయి. ఇక ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు జూన్ 10న ఇంగ్లీష్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష నిర్వహించనున్నారు. పర్యావరణ విద్య పరీక్ష జూన్ 11న నిర్వహించబడుతుంది మరియు ఎథిక్స్, హ్యూమన్ వాల్యూస్ పరీక్ష జూన్ 12న నిర్వహించబడుతుంది. ఆ తేదీల్లో ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయి.

Read also: Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్, ఆయన భార్య ఆస్తులు పెరిగాయ్..

ఇంటర్ 1వ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇలా..

* 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1.

* మే 25 (శనివారం): ఇంగ్లీష్ పేపర్-1.

* మే 28 (మంగళవారం): గణితం పేపర్-1ఏ, బొటని పేపర్-1, పొలిటికల్ సైన్స్ పేపర్-1.

* మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-1బి, జువాలజీ పేపర్-1, హిస్టరీ పేపర్-1.

* మే 30 (గురువారం): ఫిజిక్స్ పేపర్-1, ఎకనామిక్స్ పేపర్-1.

* మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేపర్-1, కామర్స్ పేపర్-1.

* జూన్ 1 (శనివారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్స్ పేపర్-1 (BIPC విద్యార్థుల కోసం).

* జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్-1.

Read also: RCB vs CSK: నేడే బెంగళూరు, చెన్నై మ్యాచ్‌.. ఆఖరి ప్లేఆఫ్స్‌ బెర్తు ఎవరిదో! ఛాన్సెస్ ఇలా

ఇంటర్ 2వ సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్

* మే 24 (శుక్రవారం): సెకండ్ లాంగ్వేజ్ పేపర్-2.

* మే 25 (శనివారం): ఇంగ్లీష్ పేపర్-2.

* మే 28 (మంగళవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2ఏ, బోటానీ పేపర్-2, పొలిటికల్ సైన్స్ పేపర్-2.

* మే 29 (బుధవారం): మ్యాథమెటిక్స్ పేపర్-2బి, జువాలజీ పేపర్-2, హిస్టరీ పేపర్-2.

* మే 30 (గురువారం): ఫిజిక్స్ పేపర్-2, ఎకనామిక్స్ పేపర్-2.

* మే 31 (శుక్రవారం): కెమిస్ట్రీ పేపర్-2, కామర్స్ పేపర్-2.

* జూన్ 1 (శనివారం): పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-2, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-2 (BIPC విద్యార్థుల కోసం).

* జూన్ 3 (సోమవారం): మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-2, జాగ్రఫీ పేపర్-2.

RamaJogayya Sastry : ఒక్క రోజు ఓపిక పట్టండి అబ్బా..’అని’ అదరగొడతాడు..

Show comments