Sri Chaitanya College: తమ కూతురు చాలా ధైర్యవంతురాలని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికిది కాదని శ్రీ చైతన్య కాలేజీ స్టూడెంట్ వర్ష పేరెంట్స్ కన్నీరుమున్నీరుగా విలపించారు. చదువులోనూ బ్రిలియంట్ స్టూడెంట్ అని.. కూతురు వర్ష ఇష్టంతోనే ఈ కాలేజీలో చేర్పించామని తండ్రి వాపోయాడు. బలవంతంగా చదివించాలని తీసుకొని రాలేదని క్లారిటీ ఇచ్చారు. రోజు మాతో ఫోన్లో మాట్లాడేది కానీ.. ఎప్పుడూ కూడా ఇబ్బంది అవుతుందన్న విషయం చెప్పలేదని కన్నీరుమున్నీరయ్యారు. బుధవారం రోజు కూడా మాతో మాట్లాడిందని, నిన్న మధ్యాహ్నం 12 గంటలకు వర్షం చనిపోయిన సంఘటన జరిగితే.. మాకు మధ్యాహ్నం 2 గంటలకు ఫోన్ చేసి చెప్పారని ఆవేదన చెందారు. తన కూతురు ఎలా చనిపోయిందో నాకు తెలియాలి? అని డిమాండ్ చేశారు. తన కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని, ఆ అనుమానాలను మేనేజ్మెంట్ నివృత్తి చేయాలని అన్నారు. తన ఇతర డిమాండ్లు ఏవి చేయడం లేదని కన్నీరుమున్నీరయ్యాడు. కాగా.. గతేడాది ఫిబ్రవరిలోనూ ఇదే శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే..
Read also: Bank Holidays: వచ్చే ఏడాదిలో ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులో తెలుసా?
హైదరాబాద్ పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న వర్ష బాత్ రూమ్ లో కర్రకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వర్ష స్వగ్రామం గుండ్ల వ్యాపార గ్రామం. వర్షం శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ తన ఇష్టంతోనే చదువుకునేందుకు చేరింది. అయితే ఏమైందో ఏమో కానీ బాత్రూమ్ లో తన చున్నీతోనే వేలాడుతూ కనిపించడం అక్కడున్న విద్యార్థినులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే యాజమాన్యానికి సమాచారం అందించారు. దీంతో యాజమాన్యం హుటా హుటిన అక్కడకు చేరుకుని వర్ష మృతదేహాన్ని కిందికి దించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కాలేజీకి చేరుకుని కేసునమోదు చేశారు. దర్యాప్తు ప్రారంభించారు. అయితే వర్షం ఆత్మహత్య సంఘటన 12 గంటలకు జరిగితే.. కుటుంబ సభ్యులకు 2గంటలకు తెలియజేయడం పై పేరెంట్స్ మండిపడుతున్నారు. తమ కూతురు పిరిచికాదని, అసలు ఏం జరిగిందే వివరాలు వెంటనే తెలియజేయాలని కోరుతున్నారు. గత ఏడాదిలో కూడా ఓ స్టూడెంట్ ఇక్కడే హత్మహత్య చేసుకున్న దాఖలాలు వున్నాయని, ఇప్పుడు మా కూతురు చనిపోవడానికి గల కారణాలు యాజమాన్యం క్లారిటీ ఇవ్వాలని కోరారు. తమకు సమాచారం ఇవ్వకుండా వర్ష డెడ్ బాడీని పోస్టుమార్టంకు పంపడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని వాపోయారు.
Gidugu Rudraraju: వైఎస్ షర్మిల పార్టీలోకి వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం..