Site icon NTV Telugu

Intermediate Board: ఇంటర్‌లో మళ్లీ పాత పద్దతి.. వంద శాతం సిలబస్..

Intermediate Board

Intermediate Board

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి.. విద్యావ్యవస్థలో అనేక మార్పులకు కారణమైంది.. కొన్నిసార్లు అసలు పరీక్షలు లేకుండానే పాస్‌ చేయాల్సిన పరిస్థితి తెచ్చింది.. స్కూల్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరుతో ఇంట్లోనే కూర్చొబెట్టింది.. ఇక, సిలబస్‌ను తగ్గించడం.. పరీక్షల్లో ఆప్షన్‌గా ప్రశ్నలు పెంచడం.. ఇలా అనేక మార్పులు వచ్చాయి.. కానీ, ఇప్పుడు మహమ్మారి పోయి సాధారణ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈఏడాది నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుందని స్పష్టం చేసింది.

Read Also: Girl Kisses Cheetah: చిరుతతో యువతి ముద్దులాట.. ఎంతో ఘాటు ప్రేమయో..!

కరోనా కారణంగా రెండేళ్లు తరగతులు సరిగా జరగలేదు. దీంతో 30 శాతం సిలబస్‌ను తొలగించారు. ఇంటర్ ఆధారంగానే ఎంసెట్‌లోనూ 70 శాతం సిలబస్‌తోనే పరీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఉండటంతో పాత విధానం తీసుకువస్తున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ లో వంద శాతం సిలబస్‌ అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది ఇంటర్‌ మీడియట్‌ బోర్డు.. కరోనాకు ముందు ఉన్న విధంగానే ప్రశ్నపత్రం ఉంటుందని తెలిపింది.. కాగా, కోవిడ్ నేపథ్యంలో గత రెండేళ్లుగా 70 శాతం సిలబస్‌తోనే పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే.. ప్రశ్న పత్రంలోనూ ఛాయిస్ పెంచింది బోర్డు.. కరోనా తగ్గి సాధారణ పరిస్థితులు వచ్చిన నేపథ్యంలో మళ్లీ పూర్వ స్థితిలోనే పరీక్షలు ఉంటాయని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది..

Exit mobile version