Site icon NTV Telugu

Inter Exams : ప్రారంభమైన ఇంటర్‌ పరీక్షలు.. మాస్క్‌ తప్పనిసరి..

Inter Exams Mask

Inter Exams Mask

ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ బోర్డు స్పష్టం చేసింది. కోవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా శుక్రవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల్లో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్‌ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది విద్యాశాఖ. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసిన విద్యాశాఖ.. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న వారికి ప్రత్యేకంగా ఐసోలేషన్‌ గదులు ఏర్పాటు చేశారు.

ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని పరీక్ష కేంద్రం ఆవరణలో, బయట నీడ లేకుంటే ప్రత్యేక షామియానాలు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంది. విద్యుత్, తాగునీటి సౌకర్యంతోపాటు అత్యవసర వైద్య సేవల కోసం ఆశా వర్కర్స్, ఏఎన్‌ఎంలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. డీహైడ్రేషన్‌ నుంచి విద్యార్థులను రక్షించేందుకు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నారు. పరీక్ష కేంద్రంలో వాటర్‌ బాటిల్‌ మాత్రమే అనుమతిస్తారు. సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను లోనికి అనుమతించరు.

Exit mobile version