Site icon NTV Telugu

TS Inter Exams: మారిన ఇంటర్‌ పరీక్షల తేదీలు.. కొత్త షెడ్యూల్‌ ఇదిగో..

తెలంగాణలో గతంలో ప్రకటించిన ఇంటర్‌ పరీక్షల తేదీలు మారిపోయాయి.. జేఈఈ మెయిన్ ఎంట్రెన్స్ 2022 తేదీలు మారడంతో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ మార్చనున్నట్టు.. నేడో.. రేపో కొత్త షెడ్యూల్‌ వస్తుందంటూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే కాగా.. తాజాగా, ఇంటర్‌ పరీక్షలకు సంబంధించిన కొత్త తేదీలను ప్రకటించింది ఇంటర్‌ బోర్డు.. ఇక, ఏప్రిల్ 22 నుండి జరగాల్సిన పరీక్షలు… మే 6 నుండి ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు.. తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంట‌ర్ ప‌రీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేర‌కు స‌వ‌రించిన ప‌రీక్షల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు విడుద‌ల చేసింది. మే 6వ తేదీ నుంచి మే 24వ తేదీ వ‌ర‌కు ప‌రీక్షలు కొనసాగనుండగా.. ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష నిర్వహించనున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది ఇంటర్‌ బోర్డు.

Read Also: Supreme Court: హిజాబ్‌ వివాదం.. మాకు సమయం ఇవ్వండి..

ఫ‌స్టియ‌ర్ షెడ్యూల్: మే 6న సెకండ్ లాంగ్వేజ్, 9న ఇంగ్లీష్, 11న మ్యాథ్స్-ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్, 13న మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్టరీ, 16న ఫిజిక్స్, ఎక‌నామిక్స్, 18న కెమిస్ట్రీ, కామ‌ర్స్, 20న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-1, 23న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి.

సెకండియర్‌ షెడ్యూల్‌: మే 7న సెకండ్ లాంగ్వేజ్, 10న ఇంగ్లీష్, 12న మ్యాథ్స్-2ఏ, వృక్ష శాస్త్రం, పొలిటిక‌ల్ సైన్స్, 14న మ్యాథ్స్ -బీ, జువాల‌జీ, హిస్టరీ, 17న ఫిజిక్స్, ఎక‌నామిక్స్, 19న కెమిస్ట్రీ, కామ‌ర్స్, 21న ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్ పేప‌ర్-2, 24న మోడ్రన్ లాంగ్వేజెస్, జియోగ్రఫి.

Exit mobile version