Site icon NTV Telugu

TS Inter Admissions: మే 15 నుంచి ఇంటర్ అడ్మిషన్లు.. జూన్ 1 నుంచి తరగతులు

Ts Inter Admissions1

Ts Inter Admissions1

TS Inter Admissions: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు ఈ నెల 15 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ విడుదల చేశారు. జూన్ 30లోగా అడ్మిషన్లు పూర్తి చేయాలని, జూన్ 1 నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభించాలని.. అడ్మిషన్ల ప్రక్రియకు ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించవద్దని కాలేజీలకు సూచించారు. పదో తరగతి ఆధారంగా అడ్మిషన్లు నిర్వహించాలని ఆదేశించారు. ఇంటర్ బోర్డు గుర్తింపు పొందిన కళాశాలల జాబితా TSBIE యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచబడుతుంది మరియు విద్యార్థులు ఆ కళాశాలల్లో చేరాలని సూచించారు. ప్రతి కాలేజీ రిజర్వేషన్లు పాటించాలని ఆదేశించారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 10, బీసీలకు 29, వికలాంగులకు 3, ఎన్‌సీసీ, క్రీడలు, ఇతర అర్హత కలిగిన అభ్యర్థులకు 5, మాజీ సైనికుల పిల్లలకు 3, ఆర్థికంగా వెనుకబడిన వారికి 10 శాతం సీట్లు. ప్రతి కళాశాలలో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బోర్డు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

మార్గదర్శకాలు ఇవే…

ఇంటర్‌లో ఒక్కో విభాగంలో 88 మంది విద్యార్థులను చేర్చుకోవాలి. అదనపు సెక్షన్లు నిర్వహించాలంటే కళాశాల బోర్డు అనుమతి తీసుకోవాలి. దీనికి విరుద్ధంగా ఏదైనా కళాశాల వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థుల ఆధార్ నంబర్ తప్పనిసరిగా నమోదు చేయాలి. అడ్మిషన్ల వివరాలను ప్రతిరోజూ కళాశాల బోర్డులో ఉంచాలి. ఎన్ని సీట్లు భర్తీ అయ్యాయి? ఎన్ని మిగిలాయి? నవీకరించబడిన సమాచారం బోర్డులో ప్రదర్శించబడాలి.
జోగిని, తండ్రి లేని పిల్లల విషయంలో తల్లిదండ్రుల కాలమ్‌లో తల్లి పేరు నమోదు చేయాలి. కాలేజీలు బాలికలకు అన్ని రకాల రక్షణ వ్యవస్థను అందించాలి.
Korutla Trans co: కోరుట్ల ట్రాన్స్ కో ఉద్యోగులు దాడి.. పోలీస్టేషన్‌ కు చేరిన నీటి తంట

Exit mobile version