ఇవాళ సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రభుత్వం జాతీయ సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తూ రాష్ట్రవ్యాప్తంగా వేడుకలు నిర్వహిస్తోంది. వాడవాడలా జాతీయ జెండాను ఎగురవేస్తున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిర్వహించిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటుచేసుకుంది. జాతీయ జెండాకు చిన్న అవమానం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. అయితే, జెండా ఆవిష్కరణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ జాతీయ జెండాను తలక్రిందులుగా ఎగురవేశారు.
Read Also: IT Returns Refund: మీకు ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా? కారణాలు ఇవే..!!
జెండా ఆవిష్కరణలో అపశృతికి కారణమైన అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జెండా ఆవిష్కరణలో అపశృతికి కారణమైన ఆర్ఎస్ఐ సదానందను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సురేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వజ్రోత్సవాలలో జాతీయ జెండాకు అవమానం జరగడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో జాగ్రత్తగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.
Read Also: IT Returns Refund: మీకు ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా? కారణాలు ఇవే..!!