NTV Telugu Site icon

Hyderabad: స్కూలు బస్సుల్లో ఆర్టీవో అధికారుల తనిఖీలు.. డ్రైవర్ పై కేసు నమోదు

Hyderabad Rdo

Hyderabad Rdo

Hyderabad: నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం అవుతుండటంతో స్కూళ్ళు, కాలేజీల బస్సులను ఆర్టీవో అధికారుల తనిఖీలు చేపట్టారు. ఈ రోజు నుండి పాఠశాలలు ప్రారంభం కావడంతో విద్యార్థులను రవాణా చేసే స్కూల్ బస్సు లపై ఫొకస్ పెట్టారు. నిబంధనలు పాటించని స్కూలు బస్సులపై వేట వేస్తున్నారు. ఫిట్నెస్ కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. వాహనాలను రవాణా శాఖ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లంగర్ హౌజ్ లో స్కూలు, కాలేజీల బస్సుల తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని స్కూలు బస్సును సీజ్ చేశారు అధికారులు.

Read also: Manhole: మ్యాన్ హోళ్లు తెరిస్తే జైలుకే.. జలమండలి అధికారులు హెచ్చరిక..

డ్రైవింగ్ లైసెన్స్ ఎక్పైర్ కావడంతో డ్రైవర్ పై కేసు నమోదు చేశారు. మరోవైపు హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ లో స్కూల్ బస్సులను తనిఖీ చేపట్టారు. ఫిట్నెస్, ఇన్సూరెన్స్, పర్మిట్, డ్రైవర్ డ్రైవింగ్ లైసెన్స్, ఫయర్ సేఫ్టి కిట్, ఫస్ట ఎయిడ్ కిట్ లను క్షణంగా తనిఖీలు చేస్తున్నారు. పలు బస్సులను రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ అధికారులు సీజ్ చేశారు. రాజేంద్రనగర్, శంషాబాద్, మొయినాబాద్, శేరిలింగంపల్లి తో పాటు పలు చోట్ల విసృత సోదాలు నిర్వహిస్తున్నారు. ఫిట్‌నెస్ లేని బస్సుల్లో విద్యార్థులను తరలిస్తే ఆ బస్సులను సీజ్ చేసి యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

Read also: Harom Hara Movie: క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!

స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు రవాణా శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. దీంతో విద్యార్థులు ప్రమాదాల బారిన పడకుండా స్కూల్ బస్సుల ఫిట్ నెస్ పై రవాణా శాఖ దృష్టి సారిస్తున్నారు. ప్రతి విద్యా సంస్థ యొక్క వాహన ఫిట్‌నెస్ సర్టిఫికేట్ యొక్క చెల్లుబాటు ప్రతి సంవత్సరం మే 15వ తేదీ నాటికి పూర్తవుతుంది. స్కూల్ బస్సులు మరమ్మతులు చేయించుకుని ఫిట్ నెస్ సర్టిఫికెట్ పొందాలి. ఈసారి ధ్రువపత్రం అందని వాహనాలతో పాటు విద్యాసంస్థల గుర్తింపు రద్దు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రవాణా శాఖ నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.

Read also: Harom Hara Movie: క్లైమాక్స్‌ మతి పోయేలా ఉంటుంది.. ఊహించని సినిమా ఇది!

ఫిట్‌నెస్ లేని స్కూల్ బస్సులు రోడ్డెక్కితే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. విద్యాసంస్థలకు చెందిన బస్సులకు ఏటా ఫిట్‌నెస్‌ తనిఖీలు నిర్వహించాలని, డ్రైవర్ ఆరోగ్యంగా ఉండాలని, 60 ఏళ్లు మించకూడదని చెప్పారు. డ్రైవర్ వివరాలను ఆర్టీఏ కార్యాలయంలో సంప్రదించాలని, 5 సంవత్సరాల అనుభవం ఉన్న వారినే నియమించుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదు పుస్తకం, ప్రథమ చికిత్స పెట్టె అందుబాటులో ఉంచాలని, ప్రతి బస్సులో అటెండర్‌ను నియమించాలని సూచించారు. జాబితాతో పాటు బస్సు రూట్ ప్లాన్ జత చేయాలని స్పష్టం చేశారు. డ్రైవర్ అగ్నిమాపక యంత్రం, RTO నిర్వహించే ఒక-రోజు రిఫ్రెషర్ శిక్షణా కోర్సుకు హాజరు కావాల్సి ఉంటుందని తెలిపారు. తెలంగాణలో ప్రైవేటు విద్యాసంస్థలకు చెందిన బస్సులు 23,824 ఉన్నాయి.
Health Tips : దగ్గినా.. తుమ్మినా మూత్రం పడుతుందా.. ఇలా చేస్తే సమస్య దూరం