NTV Telugu Site icon

Niranjan Reddy: 10 రోజుల్లో రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

Nirajan Reddy

Nirajan Reddy

Singireddy Niranjan Reddy for Wanaparthy: రైతు ఏ కారణం చేత మరణించినా 10 రోజులలో రూ.5 లక్షల పరిహారం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి నియోజకవర్గం శ్రీరంగాపురం మండల కేంద్రంలోని రంగసముద్రంలో ప్రభుత్వ ఉచిత చేపల పంపిణీలో భాగంగా రొయ్యలు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు, రైతుబీమా, ఉచితంగా 24 గంటల కరంటు, సాగునీటి సౌకర్యంతో రైతులలో ఆత్మవిశ్వాసం పెరిగిందని వెల్లడించారు.

Read also: Harish Rao: శ్రీ సత్యసాయి సంజీవని బాలల గుండె చికిత్స కేంద్రం.. ప్రారంభించిన మంత్రి హరీశ్‌ రావు

రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం..ఇతర రాష్ట్రాలు పేర్లు మార్చి పథకాలు అమలు చేస్తున్నాయని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో చెరువులు ఎండిపోయి, మత్స్యకారులు వలసపోయారని అన్నారు.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మిషన్ కాకతీయ పథకం కింద చెరువులు నింపారని గుర్తు చేశారు. ఇక ఉచిత చేప పిల్లలు చెరువుల్లో విడిచి మత్స్యకారులకు ఉపాధి కల్పించారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రజలకు చేపల రూపంలో అందుబాటులో పౌష్టికాహారం,సబ్సిడీ గొర్రె పిల్లలతో గొల్ల కురుమలకు ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
TRS MLC Tata Madhu: సత్తుపల్లి నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే సండ్రను గెలిపించాలి