Bhatti Vikramarka : బీఆర్‌ఎస్‌ హయాంలో ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్‌లో అక్రమాలు

  • బీఆర్‌ఎస్‌ హయాంలో ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్‌లో అక్రమాలు
  • పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీ తీసుకొచ్చాం
  • కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యం
  • పరిశ్రమలను ORR వెలుపలికి మార్చే యోచన :భట్టి
Bhatti Vikramarka

Bhatti Vikramarka

Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎలాంటి స్పష్టమైన విధానం లేకుండా, కేబినెట్ అనుమతి కూడా లేకుండా కొందరికే ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ అనుమతులు ఇచ్చారని, ఆ వివరాలన్నింటిని త్వరలో ప్రజల ముందుంచుతామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పూర్తి పారదర్శకతతో కొత్త ఇండస్ట్రియల్ ల్యాండ్ కన్వర్షన్ పాలసీని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పారు. పరిశ్రమలను ORR వెలుపలికి తరలించడం, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడం, ప్రజలపై అదనపు పన్ను భారాన్ని పెట్టకుండానే ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చడం ఈ కొత్త పాలసీ ప్రధాన లక్ష్యాలు అని వివరించారు. 50 శాతం SOR రేటుతో అందరికీ సమాన అవకాశాలు కల్పించే విధంగా ఈ పాలసీ రూపొందించామని స్పష్టం చేశారు.

Pakistani Couple: భారత సరిహద్దు దాటిన పాకిస్తానీ ప్రేమ జంట..

×
×
Ad

నాచారం, మౌలాలి, కూకట్పల్లి, బాలానగర్, ఉప్పల్, జీడిమెట్ల వంటి ప్రాంతాలు ఒకప్పుడు నగరానికి వెలుపల ఉండేవని, పరిశ్రమల అభివృద్ధికి అప్పటి ప్రభుత్వాలు అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేశాయని ఆయన గుర్తుచేశారు. కానీ నగరం విస్తరించడంతో ఇప్పుడు ఇవన్నీ నగర మధ్యలోకి వచ్చాయనే చెప్పారు. దీంతో ఈ ప్రాంతాలు రెడ్ మరియు ఆరెంజ్ జోన్లుగా మారాయని, కోర్టులు కూడా పరిశ్రమలను తరలించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశాయని తెలిపారు. ఎవరినీ బలవంతంగా బయటకు పంపే ఉద్దేశ్యం లేనందున, పరిశ్రమలు స్వచ్ఛందంగా కన్వర్షన్ చేసుకునే అవకాశమే ఈ పాలసీ ఉద్దేశమని భట్టి విక్రమార్క అన్నారు.

ప్రస్తుతం ఈ పార్కుల చుట్టూ లక్షలాది ఇళ్లు నిర్మాణం అయ్యాయని, ఇక్కడే పరిశ్రమలు కొనసాగితే ఢిల్లీలా హైదరాబాద్‌లో కూడా పాఠశాలలు, కార్యాలయాలకు కాలుష్యం కారణంగా సెలవులు ప్రకటించే పరిస్థితి వస్తుందని ఆయన హెచ్చరించారు. అలాంటి పరిస్థితి రాకూడదనే సంకల్పంతోనే, పారదర్శకంగా మరియు సమగ్రంగా ఈ కొత్త పాలసీని తీసుకొచ్చామని తెలిపారు. ఈ విధానం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం లభించి, పేదల కోసం సంక్షేమ పథకాలను మరింత విస్తృతంగా అమలు చేయడానికి అవకాశం ఉంటుందని భట్టి విక్రమార్క అన్నారు.

Rohit Sharma: నయా చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. T20 ప్రపంచ కప్‌లో సరి కొత్త ప్రయాణం !