NTV Telugu Site icon

Indrakaran Reddy: నాందేడ్ గురుద్వార్ ను దర్శించుకున్న ఇంద్రకరణ్ రెడ్డి

Indrakaran Reddy

Indrakaran Reddy

Indrakaran Reddy: మహారాష్ట్రలోని నాందేడ్ సభ సన్నాహాల్లో భాగంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటన కొనసాగుతుంది. సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను ఇవాల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ బీవీ పాటిల్, ఎమ్మెల్యేలు జోగు రామన్న, షకీల్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ దర్శించుకుని, ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వారికి గురుద్వార్ ప్రబంధక కమిటీ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వారిని శాలువాలతో సత్కరించారు. ఈ నెల 5 న నాందేడ్ లో కేసీఆర్‌ బహిరంగ సభ బీఆర్‌ఎస్‌ నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Read also: BRS Meeting: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ

ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిన్న నాందేడ్ జిల్లాకు వెళ్లారు. ఆ తర్వాత విస్తృతంగా పర్యటించారు. అప్పారావు పేట్, శివిని, ఇస్లాపూర్, హిమాయత్ నగర్ గ్రామాల్లో పర్యటించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి అడుగడుగునా స్థానిక ప్రజలు స్వాగతం పలికారు. కాలనీలకు వెళ్లి వృద్ధులను కలిసి ముచ్చటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదని, ఫించన్లు రావడం లేదని, గూడు కూడా పట్టడం లేదని, మమ్మల్ని అస్సలు పట్టించుకోవడం లేదని మహిళలు, వృద్ధులు మంత్రి ఎదుట వాపోయారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను కూడా అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ.. తెలంగాణ వంటి సంక్షేమ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించారని వ్యాఖ్యానించారు. సభకు నాందేడ్ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
Attack on Police: శామీర్ పేట్, అల్వాల్ పోలీసులపై దాడి.. బొమ్మలరామారంలో ఘటన